జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Election Commissioner Nagireddy

 

హైదరాబాద్: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 06, 10, 14వ తేదీల్లో, మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల గడువు ఇస్తున్నామని, మే 06వ తేదీన మొదటి విడుత ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ నెల 26న రెండో విడత నోటిసులు జరి చేయగా మే 10న రెండో విడత, 30న తుది విడత నోటిసులు విడుదల కాగా మే 14న తుది విడత ఎన్నికలు జరుగుతాయి. మే 27న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 535 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ఎన్నికల కోడ్ ఇవాళ్టి నుంచి అమలులో ఉంటుందని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే చేపడతామని, ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించాలని నాగిరెడ్డి తెలిపారు. జడ్పిటిసి, ఎంపిటిసికి వేరువేరు బ్యాలెట్ లు ఉంటాయని, న్యాయపరమైన ఇబ్బందులు, గడువు పూర్తి కాని కారణాల వల్ల 40 ఎంపిటిసి, ఒక జడ్పిటిసి స్థానానికి ఎన్నిలు నిర్వహించడం లేదని నాగిరెడ్డి వెల్లడించారు.

ZPTC, MPTC election notification release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.