కెటిఆర్‌ను కలిసిన జెడ్‌పి ఛైర్మన్లు…

  గెలిచామని పొంగిపోవద్దు విజేతలను అభినందించిన కెటిఆర్ హైదరాబాద్: జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని టిఆర్‌ఎస్ సొంతం చేసుకోవడంతో పార్టీ నాయకుల్లో ఉవ్వెత్తున ఉత్సాహం ఉప్పొంగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీతానై వ్యవహరించి అపూర్వవిజయాన్ని సాధించి పెట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అభినందలతో ముంచెత్తుతున్నారు. ఆదివారం హైదరాబాద్ నందినగర్‌లోని కెటిఆర్ నివాసానికి అభిమానులు,నాయకులు, కొత్తగా ఎంపికైన జిల్లాపరిషత్ అధ్యక్షులు, మండల చైర్మన్లతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలలనుంచి కెటిఆర్‌ను గౌరవంగా కలుసుకుని శుభాకాంక్షలు […] The post కెటిఆర్‌ను కలిసిన జెడ్‌పి ఛైర్మన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గెలిచామని పొంగిపోవద్దు
విజేతలను అభినందించిన కెటిఆర్

హైదరాబాద్: జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని టిఆర్‌ఎస్ సొంతం చేసుకోవడంతో పార్టీ నాయకుల్లో ఉవ్వెత్తున ఉత్సాహం ఉప్పొంగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీతానై వ్యవహరించి అపూర్వవిజయాన్ని సాధించి పెట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును అభినందలతో ముంచెత్తుతున్నారు. ఆదివారం హైదరాబాద్ నందినగర్‌లోని కెటిఆర్ నివాసానికి అభిమానులు,నాయకులు, కొత్తగా ఎంపికైన జిల్లాపరిషత్ అధ్యక్షులు, మండల చైర్మన్లతో కిక్కిరిసిపోయింది.

రాష్ట్రం నలుమూలలనుంచి కెటిఆర్‌ను గౌరవంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు బాధ్యతలను పెంచుతుందని తనను కలిసిన నాయకులతో కెటిఆర్ పదేపదే చెప్పినట్లు తెలుస్తుంది. గెలుపుకు పొంగిపోవద్దని బాధ్యతాయుతంగా ప్రజాసేవలో నిమగ్నంకావాలని కొత్తగా గెలిచిన నాయకులకు కెటిఆర్ చెప్పారు. గెలిచినవారికి అభినందనలు చెలుపుతూ బంగారుతెలంగాణ లక్ష సాధనలో నిరంతరం శ్రమించాలని చెప్పారు. కెటిఆర్‌ను గౌరవంగా కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా జెడ్‌పి చైర్మన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్‌నగర్ జెడ్‌పి చైర్మన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్‌పి చైర్మన్ నల్లాల భగ్యలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జెడ్‌పి చైర్మన్ న్యాల కొండ అరుణ, వికరాబాద్ జెడ్‌పి చైర్మన్ పట్నం సునీత, మేడ్చల్ జెడ్‌పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

ZP Chairpersons meeted to KTR

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కెటిఆర్‌ను కలిసిన జెడ్‌పి ఛైర్మన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: