ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్…

Airtel Digital TVముంబయి: ఎయిర్‌టెల్ సంస్థ తమ డిటిహెచ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్పాట్‌లైట్ చానల్ పేరుతో ఓ సరికొత్త చానల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం జీ ఎంటర్‌టైన్మెంట్‌ థియేటర్ విభాగమైన జి థియేటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఎయిర్‌టెల్ కస్టమర్లు ఈ స్పాట్‌లైట్ చానల్‌ను 191 నంబరులో ఫ్రీగా చూడవచ్చునని సంస్థ వెల్లడించింది. అయితే, ఈ సౌకర్యం 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ పది రోజుల్లో ఈ చానల్ తమ ఖాతాదారులకు నచ్చి… కొనసాగింపు కోరుకుంటే నెలకు అదనంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ టెల్ తెలిపింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చని సూచించింది. లేదంటే నేరుగా తమ వెబ్‌సైట్‌లో లాగాన్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చునని ఎయిర్ టెల్ తెలిపింది.
Zee launched theatre channel Spotlight on Airtel Digital TV

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.