పాటేదైనా పాడేస్తాడు! (వీడియో)

పోలెండ్‌కు చెందిన ఈ బుజ్జిగాడి పూర్వీకులు ఇండియాకు చెందినవారు. తాతల కాలంనాడే పోలాండ్‌లో స్థిరపడ్డారు. ఇతడికి మన భాష కాదు. పేరు బిగ్స్ బుజ్జీ. ఇంగ్లీష్ పోలిష్ తప్ప ఏమీ రావు. అయినా సరే తెలుగు పాటలు చక్కగా పాడేస్తాడు. కేవలం ఆసక్తితోనే పాటలు విని గుర్తు పెట్టుకుని పాడుతున్నాడు. హిందీ, మలయాళం, తమిళం పాటలు కూడా బిగ్స్‌బుజ్జీకి వచ్చు. పాటలంటే ప్రాణం. అతని ఆసక్తిని గమనించిన అతని తండ్రి శరత్ బిగ్స్‌కు ఆరేళ్ల వయస్సు నుంచే […] The post పాటేదైనా పాడేస్తాడు! (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పోలెండ్‌కు చెందిన ఈ బుజ్జిగాడి పూర్వీకులు ఇండియాకు చెందినవారు. తాతల కాలంనాడే పోలాండ్‌లో స్థిరపడ్డారు. ఇతడికి మన భాష కాదు. పేరు బిగ్స్ బుజ్జీ. ఇంగ్లీష్ పోలిష్ తప్ప ఏమీ రావు. అయినా సరే తెలుగు పాటలు చక్కగా పాడేస్తాడు. కేవలం ఆసక్తితోనే పాటలు విని గుర్తు పెట్టుకుని పాడుతున్నాడు.

హిందీ, మలయాళం, తమిళం పాటలు కూడా బిగ్స్‌బుజ్జీకి వచ్చు. పాటలంటే ప్రాణం. అతని ఆసక్తిని గమనించిన అతని తండ్రి శరత్ బిగ్స్‌కు ఆరేళ్ల వయస్సు నుంచే భారతీయ భాషల పాటలను వినిపించేవాడు. బిగ్స్‌కు అసాధారణ జ్ఞాపకశక్తి ఉంది. ఎంత కష్టమైన పాటనైనా కేవలం రెండు గంటల్లోపే నేర్చుకునేవాడు. వాటిని పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే బిగ్స్ పాటలు సంచలనాలయ్యాయి. భారతీయ సినీ ప్రముఖుల ప్రశంసలు కురిశాయి. నాగార్జున, కమలహాసన్, రజనీకాంత్, షారుక్‌ఖాన్ వంటి అగ్రహీరోలు సైతం బిగ్స్ గురించి ట్వీట్లు చేశారు. ఇప్పటి వరకు తెలుగులో 69, హిందీలో 20, ఆంగ్లంలో 25, స్పానీష్‌లో 10, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో మరికొన్ని పాటలు పాడాడు. పాటలే కాదు ఓ తెలుగు చిత్రంలోనూ నటించాడు బిగ్స్‌బుజ్జీ. వరుణ్‌తేజ్ నటించిన ‘మిస్టర్’ చిత్రంలో కన్పించి మెప్పించాడు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే మనస్సుకు నచ్చింది చేయగలుగుతున్నాని అంటున్నాడు బిగ్స్‌బుజ్జీ.

 

The post పాటేదైనా పాడేస్తాడు! (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.