అంతర్జాతీయ క్రికెట్ యువరాజ్ సింగ్ గుడ్ బై…

ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా  యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం, లేవడం ,ముందుకు సాగడం నేర్పిందని యువరాజ్‌ తెలిపారు. 2000 సంవ‌త్స‌రంలో భార‌త త‌ర‌ఫున అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువరాజ్ […] The post అంతర్జాతీయ క్రికెట్ యువరాజ్ సింగ్ గుడ్ బై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా  యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం, లేవడం ,ముందుకు సాగడం నేర్పిందని యువరాజ్‌ తెలిపారు. 2000 సంవ‌త్స‌రంలో భార‌త త‌ర‌ఫున అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ భారత క్రికెట్ కు 19ఏండ్ల పాటు సేవలందించాడు. యువరాజ్ సింగ్ తన కెరీర్ లో 304 వన్డేలు,58 టీ20 మ్యాచ్ లు,40 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ 20 ప్రపంచకప్ విజయంలోనూ యువీ కీలక పాత్ర పోషించారు. 2011 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ధోనీసేన కప్ గెలవడంలో అసాధారణ పాత్ర పోషించాడు.  2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు.

Yuvraj Singh announces retirement from international cricket

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అంతర్జాతీయ క్రికెట్ యువరాజ్ సింగ్ గుడ్ బై… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: