లవర్‌కు మ్యారేజ్…. యువకుడు గన్‌తో షూట్ చేసుకొని…

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అగ్రాలో ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో భగ్న ప్రేమికుడు గన్‌తో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెనౌరా గ్రామంలో సుఖ్‌వీర్ అనే వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరొక అబ్బాయితో మూడు నెలల క్రితం పెళ్లి చేశారు. దీంతో లవర్ మ్యారేజ్ చేసుకోవడంతో […] The post లవర్‌కు మ్యారేజ్…. యువకుడు గన్‌తో షూట్ చేసుకొని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అగ్రాలో ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో భగ్న ప్రేమికుడు గన్‌తో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెనౌరా గ్రామంలో సుఖ్‌వీర్ అనే వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరొక అబ్బాయితో మూడు నెలల క్రితం పెళ్లి చేశారు. దీంతో లవర్ మ్యారేజ్ చేసుకోవడంతో అతడు మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఉదయం తన రూమ్‌లోకి వెళ్లి బ్లాంక్ పాయింట్‌లో గన్‌తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సుఖ్‌వీర్ అన్నయ్య పుష్పేందర్ తెలిపాడు. రూమ్‌లో రక్తపు మడుగులో కుమారుడు కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సూసైడ్ లేటర్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 
Youth shoots self with Lover Marry Another Man

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లవర్‌కు మ్యారేజ్…. యువకుడు గన్‌తో షూట్ చేసుకొని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: