ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం.. చనిపోయేముందు యువకుడి సెల్ఫీ వీడియో..

హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జవహర్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. ఇటీవల సదరు యువకుడు కరోనాతో ఆస్పత్రిలో చేరాడు. అయితే, తనకు ఊపిరాడటంలేదని వెంటిలేటర్ పెట్టాలని యువకుడు బతిమిలాడినా.. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం వెంటిలేటర్ పెట్టేందుకు నిరాకరించింది. దీంతో మూడు గంటలపాటు తీవ్ర ఇబ్బందిపడి యువకుడు మరణించాడు. అయితే, చనిపోయేముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ”నాకు ఊపిరాడటంలేదని వెంటిలేటర్ పెట్టాలని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. మూడు గంటల నుంచి నాకు ఊపిరాడుతలేదు, నేను చచ్చిపోతున్నా.. బాయ్ డాడీ” అంటూ చనిపోయే ముందు అతను రోధిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Youth Selfie video before died with Corona in Erragadda 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో దారుణం.. చనిపోయేముందు యువకుడి సెల్ఫీ వీడియో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.