కరోనాకు యువత మినహాయింపు కాదు

  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ హెచ్చరిక రోమ్ : కరోనా వైరస్ మహమ్మారికి యువత మినహాయింపు కాదని దీనివల్ల యువతకు అంతగా ప్రమాదం ఉండదన్న అభిప్రాయం సరికాదని, ఎక్కువగా ఈ వైరస్ వృద్ధులకు సోకుతున్నప్పటికీ, యువత దీనికి మినహాయింపు కాదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానోమ్ హెచ్చరించారు. ‘ఈరోజు యువతకు సందేశం అందిస్తున్నాను. మీరేం దీనికి మినహాయింపు కాదు. ఈ వైరస్ మిమ్మల్ని కొన్ని వారాల పాటు ఆస్పత్రి పాలు […] The post కరోనాకు యువత మినహాయింపు కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ హెచ్చరిక

రోమ్ : కరోనా వైరస్ మహమ్మారికి యువత మినహాయింపు కాదని దీనివల్ల యువతకు అంతగా ప్రమాదం ఉండదన్న అభిప్రాయం సరికాదని, ఎక్కువగా ఈ వైరస్ వృద్ధులకు సోకుతున్నప్పటికీ, యువత దీనికి మినహాయింపు కాదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానోమ్ హెచ్చరించారు. ‘ఈరోజు యువతకు సందేశం అందిస్తున్నాను. మీరేం దీనికి మినహాయింపు కాదు. ఈ వైరస్ మిమ్మల్ని కొన్ని వారాల పాటు ఆస్పత్రి పాలు చేస్తుంది. లేదా చంపుతుంది’ అని ఆయన యువతను హెచ్చరించారు. మీరు అనారోగ్యం కాకున్నా సరే, మీరెక్కడికి వెళ్లారో దాని బట్టి మీ చావుబతుకులు ఆధార పడి ఉంటాయని ఆయన హెచ్చరించారు. చైనా శనివారం వరుసగా మూడో రోజు కూడా కరోనా కేసులు ఏవీ రాలేదని ప్రకటించడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందిస్తూ గత ఏడాది ఎక్కడైతే కరోనా వైరస్ పుట్టిందో అక్కడ వుహాన్‌లో ఆశల వెలుగులు ప్రసరించడం మిగతా ప్రపంచానికి ఆశలు కలిగిస్తోందని పేర్కొంది. అయితే హాంకాంగ్‌లో శుక్రవారం 48 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామంది విదేశాలకు ప్రయాణించిన చరిత్ర ఉంది. లేదా ఐరోపా నుంచి వచ్చి ఉంటారని తెలుస్తోంది.

 

Youth is no exception to Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాకు యువత మినహాయింపు కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: