యూత్‌కు కనెక్ట్ అయ్యే ‘ఓ బేబీ’…

  సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగశౌర్య మాట్లాడుతూ “ఒక రోజు నందినీరెడ్డి మా ఇంటికి వచ్చి సినిమా కథ చెప్పారు. అప్పుడు నా క్యారెక్టర్ చాలా తక్కువగా అనిపించింది. అయినా కూడా సినిమాకు ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా […] The post యూత్‌కు కనెక్ట్ అయ్యే ‘ఓ బేబీ’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగశౌర్య మాట్లాడుతూ “ఒక రోజు నందినీరెడ్డి మా ఇంటికి వచ్చి సినిమా కథ చెప్పారు. అప్పుడు నా క్యారెక్టర్ చాలా తక్కువగా అనిపించింది. అయినా కూడా సినిమాకు ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మి ఉన్నారు.

‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఆమెతో కలిసి పనిచేయాలని కోరిక. ఈ సినిమాలో లక్ష్మితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ‘ఓ బేబీ’. అమ్మలకు కనెక్ట్ అయ్యే ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నా లుక్ బాగుందని అందరూ అంటున్నారు.

ఇందులో నా హెయిర్ కట్ డిఫరెంట్‌గా ఉంది. కాస్త లావయ్యాను. గడ్డం బావుందని చాలా మంది అంటున్నారు. సమంతతో కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు పెద్ద హీరోయిన్‌తో చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఆమె ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం మా సొంత ప్రొడక్షన్‌లో ‘అశ్వత్థామ’ చేస్తున్నాను. అవసరాల శ్రీనివాస్‌తో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాలో నటిస్తున్నాను. ‘పార్థు’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నా”అని అన్నారు.

Youth Connecting Movie is Oh Baby

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యూత్‌కు కనెక్ట్ అయ్యే ‘ఓ బేబీ’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.