రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్న యువత అరెస్టు

  రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షాలను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసులు అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరులో సోమవారం చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువతను సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచుతామని, ప్రజలు మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని పోలీసులు వెల్లడించారు. కాగా, మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూను […] The post రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్న యువత అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షాలను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసులు అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన జిల్లాలోని కొత్తూరులో సోమవారం చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువతను సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచుతామని, ప్రజలు మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని పోలీసులు వెల్లడించారు.

కాగా, మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూను పాటించాలని సిఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో తెలిపిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని తరమేందుకు… ఎవరికీ వారే తగిన జాగ్రతలు తీసుకోవాలని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా దవాఖాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కెసిఆర్ సూచించారు. నిన్న పాటించినట్లే ఈ నెల 31 వరకు కర్ఫ్యూను పాటించి, మనం ఇళ్లల్లో ఉంటే సమాజానికి సేవ చేసినట్టేనని ఆయన తెలిపారు.

Youth arrested for not following government instructions

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్న యువత అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: