కుటుంబ కలహాల నేపథ్యంలో …

Murderహైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తమ్ముడు తన అన్నను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. తమ్ముడు సాయికుమార్ తన అన్న సంతోష్ కుమార్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంతోష్ కుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ కుమార్ చనిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే తన అన్న సంతోష్ కుమార్ ను హత్య చేసినట్టు నిందితుడు సాయికుమార్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో పోలీసులు సాయికుమార్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Younger Brother Killed His Brother In Secunderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుటుంబ కలహాల నేపథ్యంలో … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.