అన్న చేతిలో తమ్ముడు హతం..

  నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లాలోని హమాల్ వాడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా హమాల్ వాడి గ్రామానికి చెందిన (చౌదరి దత్తు, చౌదరి కిషోర్‌) అనే ఇద్దరి అన్నదమ్ముల మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో కోపంతో అన్న చౌదరి కిషోర్‌ తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో దత్తు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దత్తుని […] The post అన్న చేతిలో తమ్ముడు హతం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లాలోని హమాల్ వాడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా హమాల్ వాడి గ్రామానికి చెందిన (చౌదరి దత్తు, చౌదరి కిషోర్‌) అనే ఇద్దరి అన్నదమ్ముల మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో కోపంతో అన్న చౌదరి కిషోర్‌ తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో దత్తు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దత్తుని స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. చౌదరి దత్తు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకొని నిందితుడు చౌదరి కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  ఆర్థిక కారణాలే అన్నదమ్ముల ఘర్షణకు కారణమని స్థానికులు పేర్కొన్నారు.

younger brother died in elder brother knife attack in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అన్న చేతిలో తమ్ముడు హతం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: