మా ఊరికి పంపండి.. కెటిఆర్‌కు ఓ సోదరి విజ్ఞప్తి..

 

హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల క్రితం నుంచే లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అత్యవసర సేవలు మినహాయించి మిగిలినవన్నీ కూడా బంద్ కావడంతో కొంతమంది తమ సొంతూర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని అనే ఓ అమ్మాయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. ‘ఉద్యోగం చూసుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఎటూ వెళ్ళలేక ఇక్కడే ఇరుక్కుపోయాను. రెండు రోజుల నుంచి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్నా.. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు నాకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. నేను తిరిగి మా ఊరి వెళ్ళడానికి సాయం చేయండి’ అని మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ చేసింది. దీనికి మంత్రి స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Young Woman who asked KTR to help

The post మా ఊరికి పంపండి.. కెటిఆర్‌కు ఓ సోదరి విజ్ఞప్తి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.