అత్యాచారం చేసి బండతో కొట్టి

  మరో సామూహిక హత్యాచారం మృతురాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన మనతెలంగాణ/హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు అత్యాచారం చేసి ఆపై మొహంపై బండరాయితో మోదీ దారుణంగా హతమార్చిన ఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో బ్రిడ్జి కింద వివస్త్రగా పడివున్న యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం […] The post అత్యాచారం చేసి బండతో కొట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మరో సామూహిక హత్యాచారం

మృతురాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన

మనతెలంగాణ/హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు అత్యాచారం చేసి ఆపై మొహంపై బండరాయితో మోదీ దారుణంగా హతమార్చిన ఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో బ్రిడ్జి కింద వివస్త్రగా పడివున్న యువతి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలు సాఫ్ట్‌వేర్‌ఉద్యోగినిగా గుర్తించిన పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చునని ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. మిస్సింగ్ కేసు ఆధారంగా కేసు విచారిస్తున్న పోలీసులు రాష్ట్రంలోని మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు 10 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఇదిలావుండగా ఘటనా స్థలంలో క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మృతురాలి ఆచూకీ, నిందితులను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్ల పరిధిలో పోలీసుల్ని అలర్ట్ చేశారు.

సిసిటివి ఫుటేజీల పరిశీలన 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో వంతెన కింద గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆతర్వాత హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. చేవెళ్ల డిఎస్‌పి రవీందర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్వ్కాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిందితులను అనతికాలంలో పట్టుకుంటాంః డిసిపి
తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద యువతి అత్యాచారం, హత్య కేసును త్వరలోనే కేసు ఛేదిస్తామని శంషాబాద్ డిసిసి పేర్కొన్నారు. ఘటనలో మృతి చెందిన యువతి వయసు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని విచారణలో తేలిందన్నారు. కాగా ఆమె ఒంటిపై బంగారు గొలుసు, చేతికి రింగ్, చెవులకు కమ్మలు అలాగే ఉన్నాయని వివరించారు.

తెల్లవాజు జామునే ఘటన : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద యువతి అత్యాచారం,దారుణ హత్య మంగళవారం నాడు తెల్లవారు జామున జరిగిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయంలో ఆ దారిలో వెళ్ళిన కొందరిని విచారించినట్లు సమాచారం. అయితే తమకు రాత్రి కనిపించలేదని స్థానికులు చెప్పడంతో ఘటన తెల్లవారుజామున జరిగిఉంటుందని పోలీసులు ఆదిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఉన్న సిసి పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కాగా ఘటనాస్థలంలో డాగ్ స్వాడ్ బ్రిడ్జిపైకి చేరుకుని చేవెళ్ల దిశగా వెళ్లినట్లు గుర్తించాయి. దీంతో నిందితులు ఉపయోగించిన వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో మృతురాలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గుర్తించిన పోలీసులు ఆమె ఫోటోలను ప్రముఖ సాఫ్ట్‌వేర్ కపెంనీల పంపించారు.

Young woman Raped and then Murdered

The post అత్యాచారం చేసి బండతో కొట్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: