ఆస్తికోసం యువతుల ఆందోళన

climbing the Cell Tower

 

కారేపల్లి : కుటుంబంలోని ఆస్తి వివాదాలతో యువతులు బిఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవరెక్కి ఆందోళనకు దిగిన ఘటన మండల కేంద్రమైన కారేపల్లిలో చోటు చేసుకుంది. భాధితులు గ్రామస్తుల కథనం ప్రకారం కారేపల్లికి చెందిన జడల వెంకటేశ్వర్లు, జడల సత్యనారాయణ ఇద్దరు అన్నదమ్ములు, వీరి ఉమ్మడి కుటుంబ ఆస్తిగా కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లో 8 షట్టర్‌ల బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది. తమ్ముడు జడల సత్యనారాయణ ఐదేండ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి ఇద్దరు భార్యలు కూడా అప్పటికే మృతి చెందారు. వీరికి గీతాంజలి, కీరవాణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటి నుండి ఒకరు పెదనాన్న జడల వెంకటేశ్వర్లు వద్ద ఏడాది వరకు ఉండగా మరోకరు ఖమ్మంలోని అత్తయ్య దగ్గర ఉన్నారు. జడల సత్యనారాయణ మృతి చెందిన దగ్గర నుండి బిల్డింగ్ సంబంధించి అన్ని లావాదేవీలను జడల వెంకటేశ్వర్లు చూసుకునేవాడు.

ఆస్తిభాగం ఇవ్వకుండా ధౌర్జన్యం చేస్తున్నారు
కారేపల్లిలో తమ తండ్రి భాగానికి రావాల్చిన నాలుగు గదుల షాపింగ్ కాంప్లెక్స్‌ను పెదనాన్న ఆక్రమించుకోని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భాదిత యువతులు కీరవాణి, గీతాంజలి, ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు వేయగా, అది నడుస్తుండగానే తమ తండ్రి భాగానికి చెందిన రెండు షట్టర్లను పెదనాన్న వెంకటేశ్వర్లు తమకు తెలియకుండానే విక్రయించాడని వారు పేర్కోన్నారు. తమ ఆస్తిని కాపాడుకోవడానికి కారేపల్లికి వస్తే తమపై పోలీసుల ఎదుటే దాడులు చేశాడని తెలిపారు. తమకు పోలీస్‌ల ఎదుటే ఈ విధంగా ప్రవర్తిస్తే తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందని భాధిత యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆస్తి తగాదా విషయమై మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే.

ఏసిపి హమీతో టవర్ దిగిన యువతి
తమకు అన్యాయం చేస్తున్న జడల వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువతి కీరవాణి సెల్ టవర్ ఎక్కింది. గీతాంజలి కూడా సెల్ టవర్ ఎక్కడానికి ప్రయత్నం చేయగా సాధ్యం కాక క్రిందనే ఉండిపోయింది. న్యాయం జరగడం లేదని ఆత్మహత్య చేసుకుంటానని యువతి బెదిరించింది. సెల్ టవర్ ఎక్కిన విషయాన్ని తెలుసుకున్న ఎస్సై పొదిల వెంకన్న, సిఐ బి.శ్రీనువాసులు, తహశీల్ధార్ సిహెచ్. స్వామి, ఆర్‌ఐ నిశ్చలలు ఘటనాస్ధలానికి వచ్చి కీరవాణిని దిగి రావాలని కోరారు. తమకు అందరు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయాన్ని ఏసిపి తెలపడంతో ఏసిపి చరవాణిలో మాట్లాడారు. తగు న్యాయం జరిగేలా స్వయంగా కృషి చేస్తానని హమీ ఇవ్వడంతో యువతి అందోళన విరమించి, టవర్ దిగడంతో వివాదం సద్దుమణిగింది.

Young woman climbing the Cell Tower for Justice

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆస్తికోసం యువతుల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.