చేవెళ్లలో యువతి దారుణ హత్య

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో ఓ మహిళపై అత్యాచారం చేసి, అనంతరం ముఖంపై బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. మంగళవారం తెల్లవారుజామున తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అమానుష ఘటన చిలుకూరు దేవాలయం ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా […] The post చేవెళ్లలో యువతి దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గ్రామశివారులో ఓ మహిళపై అత్యాచారం చేసి, అనంతరం ముఖంపై బండరాళ్లతో కొట్టి హత్యచేశారు. మంగళవారం తెల్లవారుజామున తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అమానుష ఘటన చిలుకూరు దేవాలయం ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం యువతి వివరాలు ఆరా తీసున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఘటనా స్థలంలో దొరకకపోవడంతో ఆమె వివరాలు సేవరించడం పోలీసులకు ఇదో ఛాలెంజ్ గా మారింది.

oman Brutal murder in Chevella Rangareddy

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చేవెళ్లలో యువతి దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: