పుట్టిన రోజని తీసుకెళ్లి…

Tenth class girl

 

హైదరాబాద్: నగరంలో మరో మైనర్ బాలికపై అత్యాచారానికి గురైన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన పుట్టిన రోజు వేడుకలకు రావాలని బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్మిన్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం… నారాయణగూడకు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం గంగాముల తండాకు చెందిన కరంటోతు రోహన్(19) అనే యువకుడు బాలికకు స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడు. రోహన్ హైదరాబాద్ లో ఐటిఐ చదువుతున్నడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29వ తేదిన రాత్రి 9 గంటల సమయంలో తన పుట్టిన రోజని చెప్పి బాలికబాలికకు మాయమాటలు తీసుకెళ్లాడు. అయితే అర్థరాత్రి వరకు తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాధిత బాలిక తల్లదండ్రులు ఆందోళనతో నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు.

తల్లదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. అయితే డిసెంబర్ 30వ తేదిన తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలిక ఇంటికి చేరుకుంది. తల్లదండ్రులు బాలికను ఎక్కడికి వెళ్లావ్.. ఏమైందని ప్రశ్నించిగా ఏమి బదులివ్వకుండా లోపలికి వెళ్లింది. దీంతో పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి పంపించి అక్కడ కౌన్సిలర్లు బాలికతో మట్లాడడంతో అసలు విషయం బయటపడింది. రోహన్ తనను ఇంజాపూర్ గ్రామం సాహెబ్ నగర్ (వనస్థలిపురం సమీపం)లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నారాయణగూడ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో అడ్మిన్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని ఇంజాపూర్ గ్రామం సాహెబ్ నగర్ లో పట్టుకుని, రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.

Young man raped on Tenth class girl

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పుట్టిన రోజని తీసుకెళ్లి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.