యువకుడికి దేహశుద్ధి చేసిన వివాహిత

Young man

 

నల్గొండ:  ఓ మహిళ తనపై వేధింపులకు పాల్పడిన యువకుడికి దేహశుద్ధి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పట్ల కొంతకాలం నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఆ యువకుడి తీరు పట్ల విసుగు చెందిన సదరు మహిళ తన భర్తతో కలిసి నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Young man misbehaviour with married woman in Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యువకుడికి దేహశుద్ధి చేసిన వివాహిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.