రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

గంభీరావుపేట : గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద స్నేహితుల దినోత్సవం రోజున జరిగిన ప్రమాదంలో గాయపడ్డ గోరంటాలకు చెందిన తిప్పరవేణి శ్రావణ్‌కుమార్(24) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ సంఘటనతో గోరంటాల గ్రామంలో విషాదం నిండింది. అర్ధాంతరంగా చనిపోయిన కొడుకు అవయవాలు ఇతరులకు ఉపయోగపడేందుకు అవయవ దానం చేశారు.  వివరాల్లోకి వెళితే.. గోరంటాల గ్రామానికి చెందిన తిప్పరవేణి ఉమ, వెంకటస్వామి దంపతులకు […]


గంభీరావుపేట : గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద స్నేహితుల దినోత్సవం రోజున జరిగిన ప్రమాదంలో గాయపడ్డ గోరంటాలకు చెందిన తిప్పరవేణి శ్రావణ్‌కుమార్(24) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ సంఘటనతో గోరంటాల గ్రామంలో విషాదం నిండింది. అర్ధాంతరంగా చనిపోయిన కొడుకు అవయవాలు ఇతరులకు ఉపయోగపడేందుకు అవయవ దానం చేశారు.  వివరాల్లోకి వెళితే.. గోరంటాల గ్రామానికి చెందిన తిప్పరవేణి ఉమ, వెంకటస్వామి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన శ్రావణ్ 10వ తరగతి వరకు చదివి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో తనవంతు సహకారం అందిస్తున్నాడు. అనంతరం కొంత కాలం గల్ఫ్‌వెళ్లి ఇటివలే ఇంటికి తిరిగి వచ్చాడు. కాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మిత్రులతో కలిసి గొల్లపల్లి వైపు వెళ్తుండగా లింగాపూర్ గ్రామ శివారులో ప్రమాదానికి గురై తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే బాధితున్ని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహం గ్రామానికి రావడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతునికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులున్నారు.