ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

  షాబాద్ : ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… కుమ్మరిగూడ గ్రామానికి చెందిన సాలె శ్రీనివాస్ (30) గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ స్థంభంపై లైట్లను సరిచేసేందుకు గ్రామము నుండి స్థంభానికి సరఫరా అయ్యే విద్యుత్ కనెక్షన్‌ను బంద్ చేసి స్థంభం ఎక్కిలైటు సరిచేస్తుండగా షాబాద్ నుంచి గ్రామానికి విద్యుత్ సరాఫరా అయ్యే మరో కనెక్షన్ […] The post ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షాబాద్ : ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం… కుమ్మరిగూడ గ్రామానికి చెందిన సాలె శ్రీనివాస్ (30) గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ స్థంభంపై లైట్లను సరిచేసేందుకు గ్రామము నుండి స్థంభానికి సరఫరా అయ్యే విద్యుత్ కనెక్షన్‌ను బంద్ చేసి స్థంభం ఎక్కిలైటు సరిచేస్తుండగా షాబాద్ నుంచి గ్రామానికి విద్యుత్ సరాఫరా అయ్యే మరో కనెక్షన్ వైర్లకు తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో కిందపడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతునికి భార్య జయమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబ రోధనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఇన్‌స్పెక్టర్ నర్సయ్య, ఎస్‌ఐలు రవికుమార్, మిస్బాద్దీన్‌లు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Young man died by Electrocution

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: