విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నల్లగొండ : విద్యుదాఘాతంతో నిమ్మగోటి సాయి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం రావులపెంట సమీపంలో ఆదివారం జరిగింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ వద్ద 11 కెవి విద్యుత్ తీగ కిందికి వాలి ఉంది. ఈ క్రమంలో తాళ్లకాంపాడు గ్రామానికి చెందిన నిమ్మగోటి సాయి అనే యువకుడు బైక్ పై వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నప్పటికీ అధికారులు […] The post విద్యుదాఘాతంతో యువకుడి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : విద్యుదాఘాతంతో నిమ్మగోటి సాయి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వేములపల్లి మండలం రావులపెంట సమీపంలో ఆదివారం జరిగింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ వద్ద 11 కెవి విద్యుత్ తీగ కిందికి వాలి ఉంది. ఈ క్రమంలో తాళ్లకాంపాడు గ్రామానికి చెందిన నిమ్మగోటి సాయి అనే యువకుడు బైక్ పై వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విద్యుత్ తీగలను సరి చేయాలని వారు విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. పోస్టమార్టం కోసం సాయి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Dead With Electrocution

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుదాఘాతంతో యువకుడి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: