హృదయ విదారక సంఘటన.. అమ్మ కళలోకి వస్తుందని యువకుడు ఆత్మహత్య

మనతెలంగాణ/ఇల్లంతకుంట: అమ్మ నువ్వే ఊక కళలకు వస్తున్నవ్, నాకు మంచిగనిపిస్తలేదు… నేను ఇక్కడుండలేను, నీదగ్గరకే వస్తున్న.. చెల్లెమ్య మంచిగుండు.. బాపు మందుతాగుడు పెట్టకు మంచిగుండు… బాపమ్మ ఉంటున్న అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన బొల్లం రాకేష్(24) అనే యువకుడి తండ్రి నారాయణ, చెల్లెలు రమ్యలు ఉన్నారు. అయితే రాకేష్ తల్లి […] The post హృదయ విదారక సంఘటన.. అమ్మ కళలోకి వస్తుందని యువకుడు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/ఇల్లంతకుంట: అమ్మ నువ్వే ఊక కళలకు వస్తున్నవ్, నాకు మంచిగనిపిస్తలేదు… నేను ఇక్కడుండలేను, నీదగ్గరకే వస్తున్న.. చెల్లెమ్య మంచిగుండు.. బాపు మందుతాగుడు పెట్టకు మంచిగుండు… బాపమ్మ ఉంటున్న అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని మృతి చెందిన హృదయ విదారక సంఘటన ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన బొల్లం రాకేష్(24) అనే యువకుడి తండ్రి నారాయణ, చెల్లెలు రమ్యలు ఉన్నారు. అయితే రాకేష్ తల్లి లక్ష్మీ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతూ మంచానపడింది. దీంతో గత ఏడాది క్యాన్సర్ వ్యాధితో భాదపడుతూ మృతి చెందింది. అమ్మపై అమితంగ ప్రేమ పెంచుకున్న రాకేష్ అమ్మ చావును మరిచిపోలేకపోయాడు.

రాకేష్ హైద్రబాద్‌లో బ్రెడ్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ పదే పదే అమ్మ గుర్తుకు రావడంతో తోటి స్నేహితులకు భాదను రోజు చెప్పుకుంటు కన్నీరు పర్యాంతమయ్యేవాడు. దీంతో తీవ్ర మనస్థాపంతో మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చి అమ్మ జ్ఞాపకాలను చూసుకుని ఏడుస్తూ గ్రామ శివారులోని తన తల్లిని దహనం చేసిన వద్దకు వెళ్లాడు. అక్కడే తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని అమ్మ నేను నిన్ను మర్చిపోలేక పోతున్న.. నీ దగ్గరకే వస్తున్న.. చెల్లె నాన్న జాగ్రత్త బాపమ్మ అంటూ వీడియో తీసి పురుగుల మందుత్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటూవైపుగా వెళ్తున్న స్థానికులు రాకేష్‌ను గుర్తించి ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి పెద్ద నాన్న బొల్లం మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లింగారం ప్రవీణ్‌ కుమార్ తెలిపారు. ఈ హృదయ విధారక సంఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Young Man committed Suicide with Poison in Karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హృదయ విదారక సంఘటన.. అమ్మ కళలోకి వస్తుందని యువకుడు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: