యువకుడు ఆత్మహత్య…

మేడ్చల్: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి హన్మాన్‌పేట్‌లో జరిగింది. స్థానికంగా నివాసముండే పి.సాయికుమార్‌(36)కు గత కొంతకాలంగా అతడి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో తనకు ఇక వివాహం కాదని సాయికుమార్‌ తీవ్ర నిరాశతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన గదిలో వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతడి అన్న ఆదిశంకర్‌ తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ […]

మేడ్చల్: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి హన్మాన్‌పేట్‌లో జరిగింది. స్థానికంగా నివాసముండే పి.సాయికుమార్‌(36)కు గత కొంతకాలంగా అతడి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ, ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో తనకు ఇక వివాహం కాదని సాయికుమార్‌ తీవ్ర నిరాశతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన గదిలో వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతడి అన్న ఆదిశంకర్‌ తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే మల్కాజిగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: