గన్‌తో కాల్చుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ యువకుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఉన్న ఓఆర్‌ఆర్‌పై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మాసబ్‌ట్యాంక్‌లోని జలవాయువు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సల్మాన్ అహ్మద్ కుమారుడు ఫైజల్ అహ్మద్ (32) యూఎస్ కన్సెల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు చేశాడు, వాటిని తీర్చేదారి కన్పించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంజ్ కారును అద్దెకు తీసుకుని ఓఆర్‌ఆర్‌కు వెళ్లిన ఫైజల్ […] The post గన్‌తో కాల్చుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ యువకుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఉన్న ఓఆర్‌ఆర్‌పై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మాసబ్‌ట్యాంక్‌లోని జలవాయువు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సల్మాన్ అహ్మద్ కుమారుడు ఫైజల్ అహ్మద్ (32) యూఎస్ కన్సెల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు చేశాడు, వాటిని తీర్చేదారి కన్పించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంజ్ కారును అద్దెకు తీసుకుని ఓఆర్‌ఆర్‌కు వెళ్లిన ఫైజల్ మంచిరేవుల వద్ద కారు ఆపి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. అమెరికా పంపిస్తానని కొందరు యువకుల వద్ద డబ్బులు తీసుకుని పంపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఫైజల్ సైతం పలువురి నుంచి వసూలు చేసిన మొత్తాలలో విషయంలో మోసపోయినట్లు సమాచారం. బెంజ్ కారును ఎస్‌ఎం జైన్ వద్ద అద్దెకు తీసుకున్న ఫైజల్ గత కొంత కాలం నుంచి అద్దె చెల్లించనట్లు తెలిసింది.

ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మూడు రోజుల నుంచి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. పెట్రోలింగ్ పోలీసులు కారు ఆగి ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడగా ఫైజల్ కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే అతడిని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఫైజల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తలపై కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తుపాకీ అతనిదేనా, ఇంకేవరిదైనా అనే కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు పరిశీలించారు. కారులో ఫైజల్ ఒక్కడే ఉన్నాడని, మొబైల్ ఫోన్, తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రాణాలతో ఉండడంతో ఫైజల్‌ను కేర్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అక్టోబర్‌లో కారు అద్దెకు ఇచ్చాం : ఎస్‌ఎం జైన్
గత నాలుగు సంవత్సరాల నుంచి కార్లను అద్దెకు ఇస్తున్నాం, సెల్ఫ్ డ్రైవింగ్ చేసే వారికి కార్లను అద్దెకు ఇస్తున్నాం అని ఎస్‌ఎం జైన్ తెలిపారు. ఫైజల్ గత అక్టోబర్, 2018లో కారును అద్దెకు తీసుకున్నాడని అతడి కారులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందని అన్నారు. కార్లను అద్దెకు ఇచ్చేందుకు తమకు లైసెన్స్ ఉన్నట్లు తెలిపారు.

young man Commits suicide with Gun Fire

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గన్‌తో కాల్చుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.