ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని ఆత్మహత్య

Young man Suicide

 

మన తెలంగాణ/ఎల్‌బినగర్ : ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఓ యువకుడు మొహానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని లోపల గ్యాస్ సిలిండర్ పైపు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలావున్నాయి. ఎన్టీఆర్ నగర్‌లోని యాదవ్‌నగర్ రోడ్డు నెం.3లోని వై ష్ణోవి అపార్ట్‌మెంట్‌లో అడ్వకేట్ గూడ వెంకట్‌రెడ్డి తన భార్య, కొడుకు అనురాగ్‌తో ఉంటున్నాడు. అనురాగ్ ఓ బ్యాంక్‌లు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 12న కుటుంబం తిరుపతి వెళ్ళడానికి ఫ్లైట్ టి క్కెట్లు కొన్నారు. మధ్యాహ్నం వెంకట్‌రెడ్డి తన భార్య, అత్తతో కలిసి క్యాబ్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వె ళ్ళారు. కాగా తాను తరువాత వస్తానంటూ అనురాగ్ తండ్రితో చెప్పాడు.

అయితే ఫ్లైట్ సమయం కావడం తో అనురాగ్ రాకుండానే వెంకట్‌రెడ్డి తన భార్య, అత్తతో కలిసి తిరుపతికి బయలుదేరాడు. కాగా అనురా గ్ తిరుపతికి రాలేదన్న విషయాన్నివెంకట్‌రెడ్డి తన సో దరుడికి, అపార్ట్‌మెంట్ వారికి తెలిపాడు. ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ వాసన వ్యాపించడంతో అందరి ఫ్లాట్‌లను తనిఖీ చేశారు. అయితే ఏ ప్లాట్ నుండి గ్యాస్ లీకైనట్లు తేలలేదు. చివరగా వెంకట్‌రెడ్డి ప్లాట్‌ను చెక్ చేయడానికి వెళ్ళగా దానికి తాళం వేసి ఉంది. వెంటనే తాళం బద్దలుకొట్టి లోనికి వెళ్ళి చూడగా అనురాగ్ ఆత్మహత్య చేసుకొని కనిపించాడు.

నల్లని ప్లాస్టిక్ కవర్‌ను మొహానికి కట్టుకొని ఆ కవర్‌లో గ్యాస్ పైప్ పెట్టుకొని మంచంపై పడుకొని గ్యాస్ వదిలి అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వారు చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనురాగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. తిరుపతి నుండి తిరిగి వచ్చిన వెంకట్‌రెడ్డి తన కుమారుడి ఆత్మహత్యకు కారణాలు తెలియవని పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Young man Commits Suicide in Chaitanyapuri

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకొని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.