భూ సమస్య పరిష్కరించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు

మన తెలంగాణ / వేములవాడ రూరల్ : తన భూమి సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన మండలంలోని శాత్రాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గుడిసె అశోక్ తాత కొన్ని సంవత్సరాల కిందట సర్వే నెం. 807లో గల ఒక ఎకరం 24 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించి విరాసత్ ఆమోదం తెలిపి, ప్రాసెసింగ్ లెటర్ ఇచ్చి కొత్త […] The post భూ సమస్య పరిష్కరించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ / వేములవాడ రూరల్ : తన భూమి సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన మండలంలోని శాత్రాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గుడిసె అశోక్ తాత కొన్ని సంవత్సరాల కిందట సర్వే నెం. 807లో గల ఒక ఎకరం 24 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు. ఈ భూమికి సంబంధించి విరాసత్ ఆమోదం తెలిపి, ప్రాసెసింగ్ లెటర్ ఇచ్చి కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వాలని గత కొన్ని నెలల నుండి తహశీల్దార్ ఆఫీస్‌కు పలుమార్లు వెళ్లి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదనే బాధతో గురువారం నాడు వాటర్ ట్యాంక్ ఎక్కి అశోక్ నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలిసిన పోలీసులు,ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అశోక్‌తో ఫోనులో మాట్లాడి విషయం సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి నర్సయ్య, మండల రెవెన్యూ ఇన్సిపెక్టర్ లక్ష్మణ్‌లను పిలిపించారు. భూ సమస్యను పరిష్కారం చేస్తామని ఆర్‌ఐ హామీ ఇవ్వడంతో అశోక్ కిందికి దిగాడు. ఆర్‌ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ అశోక్ తాతకు చెందిన భూమికి, వారసులు అంగీకారం తెలిపి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చినట్లయితే పట్టా మంజూరు చేస్తామని తెలిపారు.

young man climbed tank for solve the land problem

The post భూ సమస్య పరిష్కరించాలని ట్యాంక్ ఎక్కిన యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: