పోరాడి గెలిచింది…

కరీంనగర్‌: ప్రేమ పేరిట మోసపోయిన ఓ యువతి  న్యాయం కావాలంటూ చేపట్టిన పోరాటం ఫలించింది. ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగిన యువతికి పోలీసుల సహాకారంతో ఆలయంలో వివాహం జరిగింది. ఈ సంఘటన జమ్మికుంట మండలంలో జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన చర్లవంచ సుమలత ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నది.ఎడ్లపల్లికి చెందిన గుర్రాల రాజు అనే యువకుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. […] The post పోరాడి గెలిచింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్‌: ప్రేమ పేరిట మోసపోయిన ఓ యువతి  న్యాయం కావాలంటూ చేపట్టిన పోరాటం ఫలించింది. ప్రియుడి ఇంటి ఎదుట నిరసనకు దిగిన యువతికి పోలీసుల సహాకారంతో ఆలయంలో వివాహం జరిగింది. ఈ సంఘటన జమ్మికుంట మండలంలో జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన చర్లవంచ సుమలత ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నది.ఎడ్లపల్లికి చెందిన గుర్రాల రాజు అనే యువకుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించాడు. తర్వాత ముఖం చాటేయడంతో సదరు యువతి మంగళవారం రాజు ఇంటి ఎదుట నిరసన చేపట్టింది.దీంతో సుమలతకు బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళా నాయకురాలు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సిఐ సృజన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సుమలత ఆందోళన విరమించింది. అందరి అంగీకారంతో పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న శ్రీరామాలయంలో రాజు, సుమలత వివాహం జరిపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, రెండు కుటుంబాల సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Young Girl did Love Marriage With Police Help

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోరాడి గెలిచింది… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: