విద్యుద్ఘాతంతో యువరైతు మృతి…

Young Farmer

 

 నందిపేట : నందిపేట మండలం గంగాసరం గ్రామంలో శుక్రవారం ఉదయం గడ్డం నవీన్‌రెడ్డి( 29) అనే యువరైతు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబందించి బాదితుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీన్‌రెడ్డి ప్రతీరోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తన వ్యవసాయ పొలానికి వెళ్ళాడు. కాగా ఉదయం 6 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన మగ్గిడి నర్సారెడ్డి అటుగా వెలుతూ నవీన్‌రెడ్డి తన పొలం వద్ద కెనాల్ పక్కన ఉన్న ఎస్‌ఎస్ 4 ట్రాన్స్‌పార్మర్‌కు ఉన్న ఎర్తింగ్ వైర్‌పై ప్రమాదవశాత్తు చనిపోయి పడిఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబీకులకు పోన్ ద్వారా సమాచారం అందజేసారు.

మూత్రం పోయడానికి వెళ్ళినప్పుడు, ఎర్తింగ్ వైర్‌కు విద్యుత్తు సరపరా అయ్యి, మృతి చెంది ఉంటాడని పోలీసులు, కుటుంబీకులు బావిస్తున్నారు. మృతునికి బార్య సుమలత, ఏడేళ్ళ లోపు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. బార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపారు.

Young Farmer was Electrocuted and Died

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యుద్ఘాతంతో యువరైతు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.