ములాయంను పరామర్శించిన యోగి…

  విచిత్రంగా అక్కడే కలుసుకున్న అఖిలేష్, శివపాల్ సోషల్ మీడియాలో సంచలనం లక్నో: అనారోగ్యానికి గురైన సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) వ్యవస్థాపకుడు ములాయంసింగ్ సింగ్ యాదవ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ములాయం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి, ఉప్పు నిప్పుగా చిటపటలాడిన రెండు పార్టీల నాయకులు (బిజెపి ఎస్‌పి) ఇలా పలకరించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ములాయంను యోగి వెళ్లి కలుసుకోవడం […] The post ములాయంను పరామర్శించిన యోగి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విచిత్రంగా అక్కడే కలుసుకున్న అఖిలేష్, శివపాల్
సోషల్ మీడియాలో సంచలనం

లక్నో: అనారోగ్యానికి గురైన సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) వ్యవస్థాపకుడు ములాయంసింగ్ సింగ్ యాదవ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ములాయం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి, ఉప్పు నిప్పుగా చిటపటలాడిన రెండు పార్టీల నాయకులు (బిజెపి ఎస్‌పి) ఇలా పలకరించుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

ములాయంను యోగి వెళ్లి కలుసుకోవడం సోషల్ మీడియాలో హవా సృష్టించింది. ఇందుకు కారణాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలనాయకులు స్నేహ పూర్వకంగా కనిపించడమే కాదు… యాదవ కుటుంబంలో విభేదించి విడిపోయిన ఇద్దరు నాయకులు కూడా కలుసుకున్నారు. గత కొంత కాలంగా తండ్రి ములాయంను, ఆయన తమ్ము డు శివపాల్ యాదవ్‌తోనూ విభేదించి దూరం గా ఉంటున్న సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా చాలాకాలం తర్వాత అక్కడికి రావడం మరో విశేషం. ఆ సమయంలో శివపాల్ యాదవ్ కూడా అక్కడున్నారు.

ములాయంకు బ్లడ్ షుగర్ విపరీత స్థాయికి చేరడంతో ఆయనను ఆదివారం లోహియా మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. సోమవారం తెల్లవారు జామున రెండు గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ములాయం సింగ్ ఇంటికి వచ్చిన తర్వాత యోగి …ఆయనకు, అఖిలేష్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కుంభమేళా ఉత్సవానికి సంబంధించిన ఒక బుక్‌ను కూడా యోగి ఆదిత్యనాథ్ ములాయంసింగ్ యాదవ్‌కు కానుకగా ఇచ్చారు.

Yogi who visitation Mulayam singh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ములాయంను పరామర్శించిన యోగి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: