నామినేషన్ల ద్వారా రైతు గోడు

  దేశంలో తమిళనాడు, నిజామాబాద్ పసుపు మార్కెట్లు ప్రధానమైనవి. నిజామాబాద్ భౌగోళికంగా దేశానికి నడిమధ్యలో ఉండడంతో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు పంట విస్తీర్ణం, గిట్టుబాటు ధరలు, విత్తనాలపై పరిశోధనా కేంద్రాలను నెలకొల్పాలని దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఈ ప్రాంతంలో పసుపు పంట విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలకు మన దేశం నుండి ఎగుమతి అవుతున్న పంటల్లో పసుపు పంట విలువ ఎక్కువ. భారతదేశంలో ప్రత్యేక […] The post నామినేషన్ల ద్వారా రైతు గోడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలో తమిళనాడు, నిజామాబాద్ పసుపు మార్కెట్లు ప్రధానమైనవి. నిజామాబాద్ భౌగోళికంగా దేశానికి నడిమధ్యలో ఉండడంతో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు పంట విస్తీర్ణం, గిట్టుబాటు ధరలు, విత్తనాలపై పరిశోధనా కేంద్రాలను నెలకొల్పాలని దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఈ ప్రాంతంలో పసుపు పంట విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలకు మన దేశం నుండి ఎగుమతి అవుతున్న పంటల్లో పసుపు పంట విలువ ఎక్కువ. భారతదేశంలో ప్రత్యేక బోర్డులు ఉన్న రబ్బరు, పట్టువంటి పంటల కంటే పసుపు ఎన్నో రెట్లు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. దేశంలో సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, ఏలకులకు సంబంధించి ఉన్న బోర్డు పసుపు రైతుల అవసరాలను తీర్చలేకపోవడం వల్ల పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు, ఎర్ర జొన్నలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలను పదేపదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రైతులు పాతిక మంది ఏప్రిల్ 29 సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో నామినేషన్లు వేశారు. మరో పది మంది ఎన్నో అవరోధాల వల్ల నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో గతంలో రైతులు దాఖలు చేసిన 111 నామినేషన్లతో కూడుకొని 136 మంది రైతులు వారణాసి లోక్‌సభ నియోజకవర్గ బరిలో నిలిచారు. ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం వేసిన నామినేషన్లు కాదు. రైతు తమ ఆకలి కేకలు, ఆర్తనాదాలు ప్రపంచానికి తెలియజేసే ఒక నిరసన పంథా మాత్రమే… ప్రపంచం మొత్తం మీద పండే పసుపు పంటలో 80% మన దేశంలో పండితే అందులో 60 శాతం పంట ఒక్క తెలంగాణలోనే పండుతుంది.

దేశంలో తమిళనాడు, నిజామాబాద్ పసుపు మార్కెట్లు ప్రధానమైనవి. నిజామాబాద్ భౌగోళికంగా దేశానికి నడిమధ్యలో ఉండడంతో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపు పంట విస్తీర్ణం, గిట్టుబాటు ధరలు, విత్తనాలపై పరిశోధనా కేంద్రాలను నెలకొల్పాలని దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఈ ప్రాంతంలో పసుపు పంట విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ దేశాలకు మన దేశం నుండి ఎగుమతి అవుతున్న పంటల్లో పసుపు పంట విలువ ఎక్కువ. భారతదేశంలో ప్రత్యేక బోర్డులు ఉన్న రబ్బరు, పట్టువంటి పంటల కంటే పసుపు ఎన్నో రెట్లు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది.

దేశంలో సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, ఏలకులకు సంబంధించి ఉన్న బోర్డు పసుపు రైతుల అవసరాలను తీర్చలేకపోవడం వల్ల పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఎంత మంది నాయకులకు, ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించుకున్నా చివరకు స్వదేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తున్న పతంజలి సంస్థల అధినేతలతో చెప్పించినా పాలకులలో మార్పు కనిపించకపోవడంతో కోపోద్రిక్తులైన పసుపు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలు ప్రపంచ దృష్టికి తీసుకురావాలనే ఈ నామినేషన్లు దాఖలు చేశారు. భారతదేశం వ్యవసాయక దేశం. దేశంలో గల సుమారు 130 కోట్ల మంది జనాభాలో సుమారు 80 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకున్నారు.

భారతదేశంలో సుమారు 45 శాతం కార్మిక శక్తి వ్యవసాయంలోనే ఉంది. అటువంటి వ్యవసాయానికి సరైన మద్దతు ధర లేక, అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ ఉపకరణాలు సరిగ్గా అందక, పండించిన పంటకు మార్కెట్లు కల్పించక, సేద్యంలో రైతులకు సరైన సూచనలు సలహాలు కరువై వ్యవసాయ రంగం నానాటికి సంక్షోభంలో చిక్కుకుంటున్నది. 10 సంవత్సరాల క్రితం 15 కోట్ల కమతాలలో ఉండే వ్యవసాయ భూమి ఇప్పుడు 12 కోట్ల కమతాలకు తగ్గిపోయింది. మూడు కోట్ల కమతాల రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, లాభసాటిలేక వ్యవసాయం వదిలేసి పల్లెల నుండి పట్టణాలకు రోజువారీ కూలీలుగా వలసపోయారు. 10 సంవత్సరాల క్రితం రైతులకు గిట్టుబాటు ధర లెక్కించడానికి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రైతుల పంట పెట్టుబడి, రైతుల కుటుంబ సభ్యుల శ్రమ, భూమి కౌలు ధర మొత్తం లెక్కించి C2+50 ఫార్ములా అమలుపరచాలని సిఫార్సు చేసింది. దీని అర్థం ఏమిటంటే రైతుకు వ్యవసాయంలో పెట్టుబడి, కుటుంబ సభ్యుల శ్రమ విలువకు మరో 50 శాతం అదనంగా పంట ధర నిర్ణయించడమే ఈ C2+50 ఫార్ములా. దీనిని “స్వామినాధన్ గిట్టుబాటు ధరల ఫార్ములా” అంటారు.

నేటికి పది సంవత్సరాలు పైబడినా ఈ ఫార్ములా ప్రకారం గిట్టుబాటు ధర ఇచ్చింది లేదు. ఈ గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్ల రైతులు ఏటా 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో గత రెండు సంవత్సరాలుగా దేశం మొత్తం మీద సుమారు 210 రైతు సంఘాలు ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా దేశ రాజధాని నడిబొడ్డున నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసన కొనసాగింపుగానే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ లోక్‌సభ స్థానాలలో అభ్యర్థులుగా నిలిచారు. స్వామినాథన్ కమిటీ ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని, అందుకు అవసరమైన చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రభుత్వం తరఫున సరైన కొనుగోలు మార్కెట్ సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లు తగ్గిపోవడంతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రైవేట్ మార్కెట్ శక్తుల మీద ఆధారపడవలసి వస్తుంది. దీనివల్ల ప్రైవేట్ కొనుగోలుదారులు కుమ్మక్కయి పంట ధరలు తగ్గించి విచ్చలవిడిగా రైతుల శ్రమను దోచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుబాబుల్, జామాయిల్ రైతులు సంవత్సరానికి సుమారు రూ. 2000 కోట్లు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళారుల మోసాలను అడ్డుకోకపోగా ప్రైవేట్ మార్కెట్ శక్తులకు భుజం కాసే కొత్త “వ్యత్యాస ధరల పథకం” ముందుకు తీసుకునివచ్చాయి. దీనివల్ల దళారులు ఇంకా రెచ్చిపోయి పంట ను తమకు నచ్చిన ధరకు కొనుగోలు చేసి రైతు శ్రమను, శక్తిని నిలువునా దోచుకుంటున్నారు. దీని వల్ల మొదటి నష్టపోయేది రైతైతే, రెండవది ప్రభుత్వం.

రైతుకు గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతే, దళారులు చేసిన మోసానికి ప్రభుత్వాలు రైతుకు వ్యత్యాస ధర చెల్లించవలసి ఉంటుంది. 2017 లో మిర్చి రైతులు 2వేల కోట్ల రూపాయలు ధరల వ్యత్యాసం వల్ల నష్టపోతే ప్రభుత్వం చెల్లించింది 136 కోట్లు మాత్రమే, మామిడి రైతులు 4 వందల కోట్ల రూపాయలు కోల్పోతే ప్రభుత్వమిచ్చింది 26 కోట్లు మాత్ర మే. ఇక గోధుమ, వరి, మొక్కజొన్న, కందులు, మినుములు, ఉల్లిపాయలు తదితర పంటలు అన్నింటిలోనూ ఇదే జరుగుతుంది.“దెబ్బ ఒక దగ్గర తగిలితే మందు ఇంకో దగ్గర రాసినట్లు” రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన C2+50 ఫార్ములాను అమలు చేయడం, గిట్టుబాటు ధరలు చట్టపరం చేయడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతులకు సమస్త రుణ విముక్తి పథకం అమలు చేయకపోవడం, ఎరువులు, పురుగు మందులు వంటి వాటి ధరల నియంత్రణకు సరైన విధానాల రూపకల్పన చేయడకపోవడం వంటివి. వాటిని పట్టించుకోకుండా “గిట్టుబాటు ధర కల్పిస్తాము” అని ఎన్నికల వేళ చేసే శుష్క హామీల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. దేశం ఆహార సంరక్షణను, ఉద్యోగ కల్పనను రెండు భుజాల మీద కాస్తున్న వ్యవసాయాన్ని, దానికి కేంద్ర బిందువైన రైతును కాపాడుకోకపోతే, రైతుల ఆత్మహత్యల లాగే ప్రజల ఆకలి చావులు కూడా చూడవలసి వస్తుంది.

Yellow board Farmers nominations against Modi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నామినేషన్ల ద్వారా రైతు గోడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: