యశోద ఆస్పత్రిలో దారుణం.. రూ.8లక్షలు కట్టించుకొని బతుకున్న వ్యక్తిని చనిపోయాడని..

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంబర్‌పేట్‌కు చెందిన సి.నరసింగరావుకు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేరాడు. అయితే, 10రోజులు తర్వాత దాదాపు రూ.8లక్షలు కట్టించుకున్న యశోద యాజమాన్యం.. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నరసింగరావు మృతి చెందాడని చెప్పారు. ఇంకా రూ.5 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబంపై ఒత్తిడి చేశారు. దీంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేసుకున్న కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. ఆస్పత్రిలో నరసింగరావు బతికే ఉన్నాడని తెలుసుకొని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై ఆశ్చర్యపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీకు ఎవరు చెప్పారని తిరిగి ప్రశ్నిస్తున్నారని, యశోద ఆస్పత్రి సిబ్బంది మమ్మల్ని మానసిక వేధనకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

yashoda hospital cheating corona patient’s family

 

The post యశోద ఆస్పత్రిలో దారుణం.. రూ.8లక్షలు కట్టించుకొని బతుకున్న వ్యక్తిని చనిపోయాడని.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.