అనుమాన ఆలయనగరి యాదాద్రి

మన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించేవిధంగా యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికోసం కుబేర స్థానమైన ఈశాన్యం వైపు ఉన్న స్తంభం మీద రెండు, ఐదు, ఇరవై, ఇరవైఐదు పైసల నాణేలు, వాయువ్య స్తంభం మీద కబడ్డీ, క్రికెట్ మొదలైన ఆటలను… నైరుతిలో ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలు, చేతివృత్తుల చిత్రాలను, ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దృశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం… ఇలా యామన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు […] The post అనుమాన ఆలయనగరి యాదాద్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించేవిధంగా యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికోసం కుబేర స్థానమైన ఈశాన్యం వైపు ఉన్న స్తంభం మీద రెండు, ఐదు, ఇరవై, ఇరవైఐదు పైసల నాణేలు, వాయువ్య స్తంభం మీద కబడ్డీ, క్రికెట్ మొదలైన ఆటలను… నైరుతిలో ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలు, చేతివృత్తుల చిత్రాలను, ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దృశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం… ఇలా యామన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్తు తరాలకు అందించేవిధంగా యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికోసం కుబేర స్థానమైన ఈశాన్యం వైపు ఉన్న స్తంభం మీద రెండు, ఐదు, ఇరవై, ఇరవైఐదు పైసల నాణేలు, వాయువ్య స్తంభం మీద కబడ్డీ, క్రికెట్ మొదలైన ఆటలను… నైరుతిలో ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలు, చేతివృత్తుల చిత్రాలను, ఆగ్నేయంలో తెలంగాణ చిత్రపటం, ఉద్యమ దృశ్యం, తెలంగాణ తల్లి విగ్రహం…

ఇలా యాదాద్రిలో ఏ స్తంభాన్ని చూసినా తెలంగాణ నాగరికతా సంస్కృతీ కనువిందు చేయనున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలోని ప్రాకార రాతి స్తంభాల మీద వివిధ సాంస్కృతిక చిహ్నాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గతంలో అర ఎకరంలో ఉన్న ఆలయాన్ని ప్రస్తుతం సుమారు 4.5 ఎకరాల్లో (మాడవీధితో కలిపి) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీనికి ముందు ఈ ఆలయానికి మాడవీధి లేదు. రథం తిరగడానికి తగిన స్థలం ఉండేది కాదు. ప్రస్తుతం వీటిన్నింటిని కలిపి నిర్మాణం చేస్తున్నారు. స్వయంభూ లక్ష్మీనరసింహాస్వామిని కదిలించకుండా నిర్మాణం జరుగుతోంది. మే లేదా జూన్ వరకు శిల్పి పనులు దాదాపు పూర్తికానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంపై ‘మనతెలంగాణ’ ప్రత్యేక కథనం..దాద్రిలో ఏ స్తంభాన్ని చూసినా తెలంగాణ నాగరికతా సంస్కృతీ కనువిందు చేయనున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయంలోని ప్రాకార రాతి స్తంభాల మీద వివిధ సాంస్కృతిక చిహ్నాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గతంలో అర ఎకరంలో ఉన్న ఆలయాన్ని ప్రస్తుతం సుమారు 4.5 ఎకరాల్లో (మాడవీధితో కలిపి) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దీనికి ముందు ఈ ఆలయానికి మాడవీధి లేదు. రథం తిరగడానికి తగిన స్థలం ఉండేది కాదు. ప్రస్తుతం వీటిన్నింటిని కలిపి నిర్మాణం చేస్తున్నారు. స్వయంభూ లక్ష్మీనరసింహాస్వామిని కదిలించకుండా నిర్మాణం జరుగుతోంది. మే లేదా జూన్ వరకు శిల్పి పనులు దాదాపు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణంపై ‘మనతెలంగాణ’ ప్రత్యేక కథనం..

మూడున్నర లక్షల టన్నుల కృష్ణ శిల్పాలతో మూర్తీభవించిన లక్ష్మీనారసింహుడు 

4.5 ఎకరాల్లో దేవాలయం అభివృద్ధి అన్ని శాస్త్రాలకు అనుకూలంగా నిర్మాణం

దశావతారాల్లో విలక్షణంగా సగం మనిషి, సగం మృగం ఆకారం దాల్చిన నాలుగో అవతారమే నరసింహస్వామి. ఈ అవతార మహిమను ఘనంగా చాటే పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. తెలుగునాట వెలసిన నృసింహాలయాల్లో విశిష్టమైన పంచ నారసింహ క్షేత్రమిది. అలనాటి పవిత్రతను, తరతరాల వైభవాన్నీ నిలుపుకుంటూనే అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయం భక్తిముక్తి ప్రదాయకమని భక్తులు పేర్కొంటున్నారు.

యాదరుషి చిన్నతనం నుంచి విష్ణుభక్తుడు…

యాదగిరిగుట్ట మీద వెలసిన లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి పురాణాల్లో ఎన్నో రకాలుగా చెబుతారు. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్య శృంగుడు. అతడి పుత్రుడు యాదరుషి. యాదరుషి చిన్నతనం నుంచి విష్ణుభక్తుడు. అందులోనూ నృసింహావతారం అంటే ఎనలేని మక్కువ. ప్రహ్లాదుడు నింపుకున్నట్లే ఆ నరమృగ శరీరుడిని గుండెల్లో పదిలపరుచుకోవాలని ఆశ. దానికోసమే అతను అడవిబాట పట్టాడు. దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతలకు బలివ్వబోగా, అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించాడు. యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. అయితే, ఆ ఉగ్రరూపాన్ని యాదర్షి కళ్లతో చూడలేకపోయాడు, అతడి కోరికమేరకు స్వామి శాంత స్వరూపంలో లక్ష్మీసమేతంగా దర్శనమిస్తాడు. తనివితీరా నరసింహుడి రూపాన్ని దర్శించిన యాదర్షి వివిధ రూపాల్లో తనని అనుగ్రహించమని కోరతాడు. భక్తుల మాట జవదాటలేని ఆయన జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా సాక్షాత్కరించి స్వయంభూగా ఉద్భవించాడు. వీటిలో జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు లక్ష్మీనరసింహుడు కొండగుహలో కొలువుదీరగా, గండభేరుండ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడితో కలిసి ఆలయానికి తూర్పున పూజలు అందుకుంటున్నాడు. తేజో వలయంగా కొండ చుట్టూ ఆవరించి ఉండటంతో ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా భక్తులు అభివర్ణిస్తారు. ఆ రుషి పేరుమీదుగానే ఈ కొండ యాదగిరి గుట్టగా, యాదాద్రిగా ప్రసిద్ధి చెందింది.

ప్రత్యేక ఆకర్షణగా బ్రహ్మకాంత స్తంభాలు

ఇప్పటికే 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఆలయం లోపల అళ్వార్ల విగ్రహాలు, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం పూర్తి కాగా సప్త గోపురాలు అందంగా ముస్తాబయ్యాయి. స్తపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలుల పర్యవేక్షణలో ఉప స్తపతులు, వేల మంది శిల్పులు ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాచీన కళాఖండాలతో పాటు ఆధునిక నాగరికతను స్తంభాలపై ప్రతిబింబిస్తున్నారు. మహామండపంలోని మొదటి అంతస్థులో కాకతీయ శైలిలోని బ్రహ్మకాంత స్తంభాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.

రాజగోపురం ద్వారా భక్తులు మాడ వీధిలోకి…

గర్భగుడికి పశ్చిమాన ఉన్న రెండో ప్రాకార రాజగోపురం ద్వారా భక్తులు మాడ వీధిలోకి ప్రవేశిస్తారు. మాడ వీధికి దిగువన గర్భగుడి, మహామండపం (ఆళ్వారు మండపం) ఉంటాయి. ముఖమండపం నుంచి గుహ ఆలయంలో ఉన్న మూలవిరాట్టును దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆళ్వారు మండపంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఆకు పూజలు, వ్రతాలు చేసుకోవాలనుకునే వారు మహా రాజగోపురానికి ఇరువైపులా ఉన్న మండపాల్లోకి ప్రవేశిస్తారు. అక్కడికి సమీపంలోనే ప్రసాదం కాంప్లెక్స్, శ్రీవారి మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్ల మార్గంలో ముందుకు సాగితే శివాలయం వస్తుంది. శివుడి దర్శనాంతరం భక్తులు ఇక్కడి నుంచి వాహనాల్లో గుట్ట కిందకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

2014, అక్టోబర్‌లో తొలిసారిగా సిఎం హోదాలో కెసిఆర్ రాక

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ 2014 అక్టోబర్ 17వ తేదీన లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తానని అదే రోజు ఆయన ప్రకటించారు. నిర్మాణ పనులపై ప్రతి 15 రోజులకో సారి సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అధికారులకు, ప్రధాన శిల్పులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకుల కోసం అందంగా తీర్చిదిద్దాలని అధికారులను సిఎం ఆదేశించారు. పలుమార్లు సిఎం హోదాలో కెసిఆర్ గుట్టకు వచ్చారు

చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో..

గుహలో దేవేరితో కొలువుదీరిన పంచనారసింహుల దివ్యరూపం… ముంగిట ఆళ్వారుల ముఖమండపాలు… నలుదిక్కులా మాడవీధులు… సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, కాకతీయుల సంప్రదాయాలను ప్రతిబింబించే కృష్ణశిలా శిల్పాల సోయగాలు, ఇలా ఒకటా రెండా, అడుగడుగునా ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. గుట్టమీద రూపుదిద్దుకుంటున్న ఆలయ నిర్మాణాలు నాటి యాదగిరి గుట్టను నేడు విశ్వనగరిగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత, ఒక రాజకీయ నాయకుడు, (కెసిఆర్)అధికారికంగా ఒక ఆలయనిర్మాణానికి పూనుకోవడం బహుశా ఇదే తొలిసారి. వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో ఈ ఆలయం పునర్నిర్మితమవుతుండటం విశేషం.

పనులను పర్యవేక్షించిన కెసిఆర్

అక్టోబర్, 2014లో మొదటిసారి సిఎం కెసిఆర్ రాగా, డిసెంబర్ 17న రెండోసారి వచ్చారు. 2015 ఫిబ్రవరి 25, 27, మార్చి5వ తేదీన జరిగిన శ్రీవారి కళ్యాణంలో సిఎం కెసిఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. మే 30న యాదాద్రి అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఆయన వచ్చారు. జూలై 5వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పాటు యాదాద్రిని కెసిఆర్ దర్శించుకున్నారు. 2016 అక్టోబర్ 19న కెసిఆర్ పనులను పర్యవేక్షించారు. అలాగే నవంబర్ 23వ తేదీ 2017న పర్యటించి ఆయన పలు సూచనలు చేశారు.

కొండ కింద రెండు హెలీప్యాడ్ల నిర్మాణం

మతాలకతీతంగా ఎందరో ప్రభువులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మొదటిగా చెప్పుకోవలసిన వాడు పశ్చిమ చాళుక్యరాజు త్రిభువన మల్లుడు. ఇతడు క్రీ.శ. 1148 సంవత్సరంలోనే యాదాద్రీశుడిని దర్శించుకున్నట్లు భువనగిరి దుర్గంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ గణపతిదేవుడు, తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించుకున్నారు. ఆ రోజుల్లో యాదాద్రి కీకారణ్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేవారని, వారికి దారి కనబడక నానా ఇబ్బందులు పడేవారని చరిత్ర చెబుతోంది. వీటిని గమనించిన నిజాం ప్రభువులు కొండమీదకు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైలు, రోడ్డు, విమాన మార్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే జరుగుతుండగా, హైదరాబాద్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటిఎస్ రైల్వే సర్వీసును త్వరలో యాదగిరిగుట్ట వరకు నడపనున్నారు. కొండ కింద రెండు హెలీప్యాడ్‌లను నిర్మించనున్నట్టు అధికారులు చెప్పారు.

భారీఎత్తున శిల్పనిర్మాణం

కాకతీయుల అనంతరం ఇంత భారీఎత్తున శిల్పనిర్మాణాన్ని చేపట్టడం ఇదే తొలిసారని ఆలయ సప్తపతులు పేర్కొంటున్నారు. ఇదివరకు యాదాద్రికి వెళితే స్వయంభువుగా వెలసిన ఆసన (కూర్చున్న) నారసింహుడే దర్శనమిచ్చేవాడు. ఇకమీద స్థానక (నిల్చున్న), శయన (పవళించిన) నారసింహుడి విగ్రహాలను చూడొచ్చు. కృష్ణశిలలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహాల్లో శయన నారసింహుడు పూర్తిగా మానవ ముఖ రూపంతో శ్రీరంగనాథుడి విగ్రహాన్ని పోలి ఉంటాడు. లక్ష్మీనరసింహుడు కొలువైన ప్రధానాలయానికి ఎదురుగా స్వామి సన్నిధిలో పన్నెండు మంది ఆళ్వారుల శిల్పాలు దర్శనమివ్వబోతున్నాయి. దేశంలో ఇలాంటివి ఎక్కడా చోటుచేసుకోలేదని శిల్పులు పేర్కొంటున్నారు. పన్నెండు అడుగుల ఎత్తుండే ఆళ్వారుల రాతి ప్రతిమల మీద మరో పన్నెండు అడుగుల ఎత్తు ఉండే స్తంభాలను వాటి మీద కాకతీయుల శిల్ప సౌందర్యాన్నీ పొందుపరుస్తున్నారు.

గిన్నిస్‌కి…

ఈ నిర్మాణం ఒక విధంగా గిన్నిస్‌బుక్ రికార్డేనని శిల్పులతో పాటు స్తపతులు పేర్కొంటున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం మూడున్నర లక్షల టన్నుల కృష్ణశిలను (ప్రకాశం జిల్లా, గుజ్జేపల్లి) నుంచి తీసుకొచ్చారు. కృష్ణశిల రాయిని నిర్మాణంలో ఉపయోగించడం వలన ఆలయం లోపల, బయట చల్లగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాయితో పాటు సున్నాన్ని కలిపి నిర్మాణం చేయడం వలన సుమారు రెండువేల సంవత్సరాల వరకు ఆలయం చెక్కుచెదరకుండా ఉంటుందని వారు తెలిపారు. దీని నిర్మాణంలో ఎక్కడా ఇటుకను వినియోగించలేదు. మాములుగా ఇలాంటి గుడిని నిర్మించాలంటే 30 సంవత్సరాలు పడుతుంది, అలాంటిది మూడు సంవత్సరాల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశామని, ఆలయం ప్రారంభం అయిన తరువాత కెసిఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని స్తపతులు, శిల్పులు పేర్కొంటున్నారు. ఏ ఆలయంలోనైనా రాజ గోపురం కట్టాలంటే రూఫ్ లెవల్ వరకు రాయితో కట్టి మిగతాది ఇటుకతో కడుతారని, కానీ ఇక్కడ కిందినుంచిపై వరకు రాయితో కడుతున్నామని వెల్లడించారు. ప్రపంచంలో ఇలాంటి కట్టడం ఎవరూ కట్టలేదని, ఇలాంటి ఎన్నో వింతలు, విశేషాలు ఆలయ అభివృద్ధిలో చోటు చేసుకున్నాయని వారు పేర్కొంటున్నారు. అన్ని శాస్త్రాలతో పాటు వేదపండితుల సలహాలు, సూచనలను తీసుకొని దీనిని నిర్మించినట్టు వారు తెలిపారు.

పాత గుట్ట-, యాదగిరి గుట్టల మధ్య స్థలాన్ని సువర్ణగిరిగా..

స్వామివారి నిలయమైన విమాన గోపురాన్ని సువర్ణగిరిగా తీర్చిదిద్దుతున్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి నూటెనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయనున్నారు. సుమారు మూడున్నర ఎకరాల్లో నారసింహుడి దివ్యక్షేత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. శివకేశవులకు అభేదాన్ని చాటిచెబుతూ ఆ శిఖరం మీదే శివాలయాన్నీ ముస్తాబు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్సులను సువిశాలంగా నిర్మిస్తున్నారు. యాదాద్రి మీద నిరంతరం గోవిందనామ స్మరణ మారుమోగేలా, యజ్ఞవాటికల్లో అనునిత్యం వేదపారాయణం జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతంగా రూపొందించేందుకు సుమారు వెయ్యి ఎకరాల్లో ఈ ఆలయ నగరిని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్లాదాన్నీ అందించేందుకు పాత గుట్ట-, యాదగిరి గుట్టల మధ్య స్థలాన్ని సువిశాల రహదారులతో పచ్చని ఉద్యానవనాలతో తీర్చిదిద్దుతున్నారు.

విమాన శిఖరం వరకు రాతితోనే నిర్మాణం

విమాన శిఖరం వరకు తంజావూరు శిల్ప నిర్మాణ రీతిలో రాతితోనే యాదాద్రి ఆలయ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికోసం ప్రకాశం జిల్లాలో దొరికే కృష్ణశిలను ఎంపిక చేశారు. ఒక పొడవైన శిలను తీసుకుని దాన్ని స్తపతుల సూచనలతో దేవతారూపాలు, పువ్వులు, లతలతో అందమైన శిల్పంగా మారుస్తున్నారు.

త్వరలో పనులు పూర్తవుతాయి
-కిషన్‌రావు, వైటిడిఏ వైస్‌చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్

త్వరలో పనులు పూర్తవుతాయి. చరిత్రలో మిగిలిపోయేలా ఈ ఆలయాన్ని సిఎం కెసిఆర్ అభివృద్ధి చేయిస్తున్నారు. దీనికోసం అనేక మంది శిల్పులు పనిచేస్తున్నారు. ఈ కట్టడాలు భవిష్యత్ తరాలకు తలమానికం కానున్నాయి. సిఎం ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సుమారు వెయ్యి ఎకరాల్లో ఆలయనగరిని తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. వీటిలో 250 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో కాటేజీలు, విల్లాల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన స్థలంలో ఉద్యానవనాల అభివృద్ధి జరుగుతోంది. అటవీశాఖకు చెందిన మరో అయిదు వందల ఎకరాల్లో నారసింహ అభయారణ్యం, జింకల పార్కు లు రాబోతున్నాయి. ఆలయానికి ఉత్తర దిశగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితర ప్రముఖుల కోసం పదమూడు ప్రెసిడెన్షియల్ సూట్లను నిర్మిస్తున్నాం.

లడ్డూ మిషన్‌లను ఆర్డర్ చేశాం

ఈ ఆలయం కింద 2,190 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఇప్పటికే సేకరించాం. అందులో 600 ఎకరాలు రాయగిరిలో, 1000 ఎకరాలు టెంపుల్ సిటీ కోసం కేటాయించాం. దీంతోపాటు రానున్న రోజుల్లో లడ్డూల సంఖ్యను పెంచడానికి మిషన్‌లను ఆర్డర్ చేశాం. ఇప్పటివరకు లడ్డూలను మాన్యూవల్‌గానే తయారుచేస్తున్నాం. ఇప్పటికే 1,116 (సూట్స్) రూమ్‌లను సిద్ధం చేశాం. 160 కొత్త రూమ్‌ల నిర్మాణం ప్రారంభమయ్యింది. వివిఐపిల కోసం 13 ఎకరాల్లో 13 విల్లాలు (50) సూట్స్ సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం మాములు రోజుల్లో భక్తులు 10 వేల మంది దర్శనానికి వస్తుంటారు. సెలవురోజుల్లో ఆ సంఖ్య 50 వేలకు పైగా ఉంటుంది.
ఎన్.గీతారెడ్డి, ఈఓ, ( డిప్యూటీ కలెక్టర్)

శాస్త్రాల ప్రకారంగానే పనులు

ఆగమ, వాస్తు, శిల్ప శాస్త్రాల ప్రకారం గోపురాల మీద శిల్పాలను ఏర్పాటుచేస్తున్నాం. ప్రవేశద్వారాలకు ఇరువైపులా కనువిందుచేసే జయ, విజయుల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలోని విష్ణుమూర్తి దశావతారాలు లక్ష్మీదేవితో కొలువుదీరిన ఇతర శక్తి రూపాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. మెట్లమార్గంలోని వైకుంఠ ద్వార గాలిగోపురం, యాభై అయిదు అడుగుల ఎత్తులో, అయిదు అంతస్తుల్లో నిర్మాణం జరుగుతోంది. కనుమరుగవుతున్న శిల్పులను మళ్లీ గుర్తించి కెసిఆర్ మాకు ఈ పని ఇప్పించారు. ప్రస్తుతం బ్లేడ్, మిషన్‌లతో కటింగ్ చేయడంతో వలన మూడు సంవత్సరాల్లో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. సుమారు 2,500 మంది శిల్పులు, 8 మంది కాంట్రాక్టర్లు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.

స్తపతి అడ్వయిజర్, సుందర్‌రాజన్

ఎల్. వెంకటేశం

8919754465

 

The post అనుమాన ఆలయనగరి యాదాద్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.