యాదాద్రిలో ధ్వజారోహణ మహోత్సవం

yadadri

బ్రహ్మోత్సవాల్లో భేరీపూజ.. దేవతాహ్వానం

యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు యాదాద్రి క్షేత్రంలో అత్యంత వైభవముగా సాగుతున్నాయి. తెలంగాణకు మహా క్షేత్రమైన యాదాద్రిలో నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వాన మహోత్సవాలను ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చకులు నిర్వహించారు. ఉదయం బాలాలయంలో శ్రీ లక్ష్మీనరపింహుడిని ఉత్సవ అలంకారణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగమైన ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు స్వామి వారి అనుగ్రహం కలిగి ఉండేలా ముక్కోటి దేవతలను కోరుతూ గరుడ ముద్దలను అకాశానికి ఎగురవేస్తూ సాగిన మహోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు.

అనంతరం మహోత్సవ విశిష్టతను భక్తులకు అర్చకులు వివరించారు. సాయంకాలం ఆలయంలో నిత్య ఆరాధన భేరిపూజ, దేవతాహ్వానము నిత్యహవనము ఉత్సవాలను నిర్వహించారు. దేవతలకు అత్యంత ప్రీతికరమైన ఆయారాగ తాళాదులతో ఆహ్వానించిన మహోత్సవ విషిష్టతను భక్తులకు తెలిపారు. ఈ ఉత్సవ పూజల్లో యజ్ఞాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపుడి నరసింహచార్యులు, కాడూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, మాధవాచార్యులు, అర్చక స్వాములు, ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ అధికారులు భాస్కర్ శర్మ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచే అలంకారంతో సేవలు..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేటి నుంచి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం ఆలయంలో నిత్యహవన పారాయణాలు గావించి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఉదయం 11 గంటలకు మత్యావతార అలంకారసేవ, సాయంత్రం శేష వాహనశేవ పూజ కార్యక్రమాలను జరిపిస్తారు.

Yadadri Laxmi Narasimha Swamy Brahmotsavam 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యాదాద్రిలో ధ్వజారోహణ మహోత్సవం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.