షియోమీ ‘ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌’…ఫోన్ల ధరలు తగ్గింపు

  ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ సోమవారం(ఈరోజు) నుంచి 13వ తేదీ వరకు ‘ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌’ను నిర్వ‌హిస్తున్న‌ది. దీన్ని కింద ప‌లు ఎంఐ ఫోన్లు, టీవిల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.ఈ సేల్‌లో రెడ్‌మీ నోట్ 6 ప్రొకు చెందిన 4జిబి ర్యామ్‌, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, 6జిబి ర్యామ్ వేరియెంట్‌ను రూ.14,999 ధ‌ర‌కు, రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, రెడ్‌మీ […]

 

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ సోమవారం(ఈరోజు) నుంచి 13వ తేదీ వరకు ‘ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌’ను నిర్వ‌హిస్తున్న‌ది. దీన్ని కింద ప‌లు ఎంఐ ఫోన్లు, టీవిల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.ఈ సేల్‌లో రెడ్‌మీ నోట్ 6 ప్రొకు చెందిన 4జిబి ర్యామ్‌, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, 6జిబి ర్యామ్ వేరియెంట్‌ను రూ.14,999 ధ‌ర‌కు, రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు, రెడ్‌మీ 6 ఫోన్‌కు చెందిన 3జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.8,499 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిష‌న్‌ను రూ.1299 ధరకు, 43, 49 ఇంచుల ఎంఐ టీవిల‌ను రూ.22,999, రూ.30,999 ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వచ్చు. ఈ సేల్ ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో కొన‌సాగుతున్న‌ది.

xiaomi I Love Mi Days Sale

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: