షావోమి సేల్.. స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్!

Xiaomi

 

మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా ఇండిపెండెన్స్ డే సేల్ ప్రకటించింది. కంపెని సొంత పోర్టల్ ఎంఐ.కామ్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంది. ఆగస్ట్ 11 వరకు ఈ సేల్ నడుస్తుందని కంపెనీ తెలిపింది. రెడ్‌మి వై3 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని అసలు ధర రూ.11,999. రెడ్‌మి నోట్ 7 ప్రో ఫోన్‌ను రూ.13,999 ప్రారంభ ధరతో కొనొచ్చు. దీని అసలు ధర రూ.15,999. అంటే ఫోన్‌పై రూ.2,000 వరకు తగ్గింపు ఉంది.

రెడ్‌మి 7 ఫోన్‌పై రూ.2,500 వరకు డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్‌ను రూ.7,499 ప్రారంభ ధరతో కొనొచ్చు. దీని అసలు ధర రూ.9,999. అలాగే ఎంఐ ఇయర్‌ఫోన్స్‌ను రూ.999కు కాకుండా రూ.599కే కొనొచ్చు. ఎంఐ బ్యాండ్ 3 ధర రూ.1,799గా ఉంది. దీని అసలు ధర రూ.2,199. అలాగే ఎంఐ బ్యాండ్ (హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్)ను రూ.1,799కు కాకుండా రూ.999కే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎఫ్1 ఫోన్‌పై గరిష్టంగా రూ.8,000 వరకు డిస్కౌంట్ ఉంది. దీన్ని రూ.17,999 కొనొచ్చు. ఫోన్ అసలు ధర రూ.21,999. అలాగే ఎంఐ ఏ2 ఫోన్‌పై రూ.7,500 వరకు తగ్గింపు ఉంది. ఈ ఫోన్‌ను రూ.17,499కు కాకుండా రూ.9,999కే కొనొచ్చు. రెడ్‌మి 6 ఫోన్‌పై రూ.3,500 వరకు తగ్గింపు ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. రెడ్‌మి 6 ప్రో ఫోన్‌ను రూ.12,999కు కాకుండా రూ.8,999కే కొనొచ్చు. దీనిపై రూ.3,500 వరకు తగ్గింపు ఉంది. రెడ్‌మి నోట్ 7ఎస్ ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధరతో కొనొచ్చు. రెడ్‌మి 7ఏ ధర రూ.5,999 నుంచి ప్రారంభమౌతోంది.

Xiaomi announces Independence Day Sale

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షావోమి సేల్.. స్మార్ట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.