ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ది గ్రేట్ ఖలీ…

The Great Khaliకోల్ కతా: జాదవ్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో శుక్రవారం అనుపమ్ హజ్రాతో కలిసి ది గ్రేట్ ఖలీ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. తన స్నేహితుడు అనుమప్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను ఖలీ కోరాడు. డబ్ల్యూడబ్ల్యూఇ రింగ్ లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) ఇపుడు ఎన్నికల ప్రచార బాట పట్టాడు. ఖలీ తన స్నేహితుడు అనుపమ్‌ హజ్రా కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అనుపమ్ హజ్రా జాదవ్ పూర్ లోక్ సభ స్థానం బిజెపి తరపున బరిలో ఉన్నారు.  ఈ సందర్భంగా తమ అభిమాన  సూపర్ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీతో కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్దారు.

WWE Star The Great Khali To Campaign For BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ది గ్రేట్ ఖలీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.