ప్రపంచంలోనే పొడవైన గుహ

cave-mexicoగుహ అనగానే భూమి మీద రాళ్లతో ఉండేవి గుర్తొ స్తాయి. ఓ విచిత్రమైన గుహ అది మెక్సికో సముద్ర తీరంలో నీళ్లలో ఉండే గుహల్లో ప్రపంచంలో ఇదే పొడవైనది. గుహ అంటే రెండో, మూడో కిలోమీటర్లు ఉంటాయి. కానీ దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుంది.

* ఒకసారి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న మెక్సికో దేశ తూర్పు తీరంలో డైవర్లు సరదాగా డైవింగ్ కి దిగారు. అంతలోనే అక్కడ ఓ గుహ కనిపించిం ది. దాని పై భాగం అంతా ఎంతో చిత్రంగా అని పించింది. రాయి కరిగి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి కనిపిస్తూనే ఉంది.
* ఆ గుహకు దగ్గర్లో ఇంకొంత మంది డైవర్లు డై వింగ్‌కి వెళ్లారు. వీళ్లకి ఇంకో గుహ అక్కడ కనిపించింది. దీంతో ఇక్కడ రెండు గుహలు న్నాయని అంతా అనుకున్నా రు. ఇప్పటి వరకు మెక్సికో దగ్గరే తులుమ్‌లో 268 కిలో మీటర్ల గుహ అత్యంత పొడవైనది. ఇప్పుడు ఈ కొత్త గుహ బయటపడటంతో ఈ రికార్డు చెరిగిపోయింది.
* ఈ రెండు గుహల మీద పరిశోధనలు చేయడా నికి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. గతేడాది వీరి బృందం వీటిపై పరిశోధనలు మొదలుపెట్టింది. ముఖానికి ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకుని, చేతిలో లైట్లున్న మాస్కులు వేసుకుని, కొలిచేందుకు కొలత ను చేత పట్టుకుని ఓ గుహలోకి బయలుదేరారు. చూస్తే పై రెండు గుహలూ ఓ దగ్గర కలిసి ఉన్నా యి. ఏమిటా అని ఆరాతీస్తే ఇవి రెండూ కలిపి ఒ కే పొడవైన గుహ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఇలాంటి వాటిలో ఇదే పొడవైన గుహ అని తేల్చారు.

Worlds Largest Underwater Cave Mexico

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రపంచంలోనే పొడవైన గుహ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.