ధూమపానం హానికరం

World-No-Tobacco-Day

‘సరదా సరదా సిగరెట్టు… ఇది దొరలు కాల్చు సిగరెట్టు…” అని అనుకునేవారు ఆనాడు. చిన్న, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా మారుతున్న కాలానుగుణంగా యువత సిగరట్ తాగడం ఫ్యాషన్‌గా మారింది ఈనాడు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేస్తున్న వారిలో 22.6 కోట్ల మంది పేదవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) ఓ సర్వేలో తెలిపింది. ప్రతి సంవత్సరం మే 31వ తేదీని “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” (వరల్డ్ టుబాకో డే)గా జరుపుకుంటున్నాం. వాస్తవంగా ఈ రోజున ప్రపంచలో పొగాకును ద్వేషించేవారంతా ప్లకార్డు లు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ధూమపానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. పొగాకు వాడకం, ధూమపానం వల్ల కలిగే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తారు.

కాని పెడదారిలో వెళ్లే యువత మాత్రం ఆనందం కోసమో లేదా మానసిక ఒత్తిడి వల్లనో ధూమపానానికి అలవాటుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్ను రూపేనా ఆదాయ ముండటంతో ‘పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం’ అని వాటి ఉత్పత్తులపై ప్రమాదకర బొమ్మలను ముద్రిం చి చేతులు దులుపుకోవడం తప్ప పొగపై సరైన నియంత్రణ లేదు. బహిరంగ ధూమపానం నిషేధంలో ఉన్నా పొగరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పొగాకు శాస్త్రీయ నామం నికోటియానా టబాకం. అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి పొగా కు అమెరికాలో విరివిగా వాడేవారు. పూర్వం పొగాకు మనుషులకు, మానవాతీత శక్తులకు మధ్య అనుసంధానం చేసే సాధనంగా భావించేవారు.

పొగాకును కాలుస్తున్నట్లు లేదా పీల్చుతున్నట్లు దేవుళ్లను కూడా చిత్రించేవారు. 1560లో జీన్‌నికోట్ అనే శాస్త్రవేత్త కేధరిన్ డి మెడిస్సీ అనే రాణికి పొగాకు గురించి వివరించాడు. పొగకులోని మత్తును కలిగించే ఆల్కలాయిడ్ ‘నికోటిన్’ అనే పదం ఈ శాస్త్రవేత్త పేరు నుంచే వచ్చింది. 1964లో అమెరికాలో ఒక డాక్టర్ సిగరేట్ తాగటం వల్ల ఊపిరి తిత్తుల కేన్సర్ వస్తుందని తొలిసారిగా పేర్కొనడంతో ప్రతి సిగరెట్ పెట్టె మీద ‘పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అనే స్లోగన్ ప్రచురించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. సిగరెట్ ప్రకటనలపై మొదట నిషేధం విధించింది మాత్రం బ్రిటన్. భారత ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడాన్ని 2008లో నిషేధించింది.

కాని పొగాకు వినియోగం, ఉత్పత్తిలో భారత దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ధూమపానం చేస్తున్నారు. ధూమపానంలో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనా జనాభాలో సుమారు 31.5 కోట్ల మంది పొగతాగే వారున్నారు. ధూమపానం చేసే వాళ్లలో 80 శాతం మంది పేద, మధ్య తరగతికి చెందినవారే కావటం గమనార్హం. పొగాకు వ్యసనం వల్ల ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయేలా చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు కారణంగా ప్రతి ఏడాది 7 లక్షల మందికి పైగా చనిపోతున్నారు.

దీని వల్ల నోటి కేన్సర్, గొంతు కేన్సర్, ఊపిరి తిత్తుల కేన్సర్, అన్న వాహిక కేన్సర్, జీర్ణాశయ కేన్సర్, కిడ్నీ కేన్సర్, ఎముక మజ్జ కేన్సర్, లుకేమియా కేన్సర్, స్వరపేటిక కేన్సర్, గొంతు వెనుక ఉండే హైపో ఫెరెంజియల్ కేన్సర్, నేసోఫెరెంజియల్ కేన్సర్ వంటి అనేక రకాల కేన్సర్లు వస్తాయని పూర్తి అధ్యయనాల ద్వారా తేలింది. బహిరంగంగా పొగ తాగడం వల్ల చుట్టూర ఉన్న వారికి కూడా అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ధూమపానం అరికట్ట కలిగితే ఆరోగ్య భారతాన్ని నిర్మించగలిగిన ఆదర్శవంతులవుతారు.

World No Tobacco Day 2020

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధూమపానం హానికరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.