పొగతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం…

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం.. పొగాకు ఉత్పత్తులను ప్రజలందరు బహిష్కరించాలి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు హైదరాబాద్: పొగతాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువు ప్రమాణం పెరుగుతుంది. పొగాకు పొగలోని ఆక్సిడెంట్స్, ఫ్రి రాడికల్స్, కార్సినోజెన్స్ వంటి ఎన్నో పదార్ధాలు ఉన్నాయి. వీటితో మానవ శరీరం మీద నేరుగా, శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పొగతో సంభవించే వ్యాధులకు నేరుగా కారణం అని ప ల్మనాలజిస్టులు పేర్కొంటున్నారు. పొగతాగడంతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం కలగడమే కాకుండా ప్రా ణాంతకమైన […] The post పొగతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం..
పొగాకు ఉత్పత్తులను ప్రజలందరు బహిష్కరించాలి
సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు

హైదరాబాద్: పొగతాగడంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువు ప్రమాణం పెరుగుతుంది. పొగాకు పొగలోని ఆక్సిడెంట్స్, ఫ్రి రాడికల్స్, కార్సినోజెన్స్ వంటి ఎన్నో పదార్ధాలు ఉన్నాయి. వీటితో మానవ శరీరం మీద నేరుగా, శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పొగతో సంభవించే వ్యాధులకు నేరుగా కారణం అని ప ల్మనాలజిస్టులు పేర్కొంటున్నారు. పొగతాగడంతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం కలగడమే కాకుండా ప్రా ణాంతకమైన ఎన్నెన్నో అపాయాలు కలిగే అవకాశం ఉంది.

పక్కవారికి ప్రమాదకారి..

ధూమపానం చేసేవారికే కాక పక్కన ఉన్న వారికి కుటుంబసభ్యులకు కూడా ప్రమాదకారి అవుతోంది. ముఖ్యంగా కళ్లు, ముక్కు, గొంతుమ ఈద పడే హానికరమైన ప్రభావాలు అధికం. పొగాకు పొగలోని విషరసాయన పదార్ధాలు పర్యావరనాన్ని కలుషిత పరుస్తున్నాయి. మనిషి మృత్యుముఖంలోకి ఈడ్చే పొగాకు ఉత్పత్తులపై పో రుకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాస్పూర్తిని తీసుకురావాలి. ఆ లక్షంతోనే ప్రతి సంవత్సరం ఈ నెల 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం.

ఏటా పొగాకు వ్యాపారం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 6,000 కోట్లు ఆదాయం వస్తుండగా,, పొగాకు ఉత్పత్తుల వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధుల చికిత్సకు 15,517 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. పొగాకుతో లాభం కన్నా నష్టమే రెట్టింపు ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ధూమపానానికి బలైపోతుంటే అందులో 14 లక్షల మంది భారతీయులే కావడం బాధకరం. దేశం జనాభలో సుమారు 23 శాతం పురుషులు 3 శాతం స్త్రీలు ధూమపాన వ్యవసనపు విషకోరల్లో చిక్కుకున్నారు. వీరికి ఏటా 3, 4 శాతం మంది తోడవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

విష రసాయనాలు..

పొగాకులో సుమారు 4000 విషరసాయానాలు ఉండగా అందులో 260 విషరసాయానాలు ప్రమాదకరమైనవి గానూ, 48 రకాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వ్యవసనపరుల్లో అవి 25 రకాల ఊపిరితిత్తుల, నోటి సంబంధవ్యాధులు, క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయి. కాల్చే ప్రతి సారి రక్తపోటు 10 నుంచి 15 శాతం పెరుగుతంది. దీంతో గుండె, రక్తనాళాలు మీద అదనపు ఒత్తిడి ఏర్పడి గుండెపోటు, స్ట్రోక్ అపాయం పెరుగుతుంది. పొగతాగనివారితో పోల్చితే రోజుకు 15సిగరెట్టు కాల్చేవారిలో రక్తనాళాల వ్యాప్తి నివారణ తర్వాత అవయ అంగచ్ఛేదం రేటు రెట్టింపుకంటే ఎక్కువుంటుందని పల్మనాలజిస్టు డా. సునంద వివరించారు. సిగెరెట్ తాగడంతో మెడ క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్, ముత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్, క్లోమం క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్ అపాయాలు కూడా ఉంటాయని చెప్పారు.

పొగాకుపై నిషేధాలు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తుల వాడకంపై అనేక ఆంక్షలను, నిసేధాలను విధించాయి. రైల్వేస్టేషన్లలో పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయాన్ని నిషేధించారు. అదే విధంగా సాంస్కతిక, క్రీడల వంటి వివిధ రంగాలలో సిగరెట్ తయారీ కంపెనీలు, కార్యక్రమాలను స్పానసర్ చేయడాన్ని నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగరదని, పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలోను, మైనారిటీ తీరనివారికీ పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని నిబంధనలున్నాయి. అంతే కాకుండా పొగత్రాగడం వల్ల సంభవించే అనర్ధాలను, వాటిలో తార్, నికోటిన్ ఎంత శాతం ఉందో, ఉత్పత్తుల ప్యాకేట్లపై పెద్ద అక్షరాలలో ఆంగ్ల భాషతో పాటు స్ధానిక భాషలలో కూడా స్పష్టంగా ము ద్రించాలని నిర్ధేశించారు. వ్యాపార ప్రకటనలపై నియత్రణ విధించారు.

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పొగతో ఆరోగ్యమైన జీవితానికి అవరోధం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: