వెక్కి వెక్కి ఏడ్చాడు.. ధోనీ ఔటైనప్పుడు కాదు

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో కివీస్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. చివరిదాకా జరిగిన మ్యాచ్‌లో జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన పోరాట ప్రదర్శన చేశారు. ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత అభిమానుల గుండెలు ఆగిపోయినంత పనైంది. ధోని నిష్క్రమించిన తరువాత అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. తాజాగా ఓ ఫోటో సామాజిక మాద్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ధోనీ ఔటకాగానే ఓ ఫోటో గ్రాఫర్ ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో […] The post వెక్కి వెక్కి ఏడ్చాడు.. ధోనీ ఔటైనప్పుడు కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో కివీస్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది. చివరిదాకా జరిగిన మ్యాచ్‌లో జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన పోరాట ప్రదర్శన చేశారు. ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత అభిమానుల గుండెలు ఆగిపోయినంత పనైంది. ధోని నిష్క్రమించిన తరువాత అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. తాజాగా ఓ ఫోటో సామాజిక మాద్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ధోనీ ఔటకాగానే ఓ ఫోటో గ్రాఫర్ ఏడ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ధోనీ అభిమానులు ఆ ఫోటోను తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయానికి వచ్చేసరికి దోనీ ఔటైనప్పుడు ఏడ్చిన ఫోటో కాదని తేలింది. ఆసియా ఫుట్ బాల్ కప్‌లో భాగంగా ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాక్ ఓడిపోవడంతో ఆ దేశ ఫోటో గ్రాఫర్ వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ ఫోటోను ధోనీ నిష్క్రమించిని ఫోటో కలిపి సోషల్ మీడియాలో షేర్ చేశారంతే. ఈ ఫోటో ఫేక్ అని తెలియడంతో ధోనీ అభిమానులు నాలుక కరుచుకున్నారు.

World Cup 2019: Photo Graph er Cry with Dhoni Out

The post వెక్కి వెక్కి ఏడ్చాడు.. ధోనీ ఔటైనప్పుడు కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: