హ్యాట్రిక్‌పై కివీస్ కన్ను

నేడు అఫ్గాన్‌తో పోరు టాంటాన్: వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ జట్టు శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పసికూన పరిగణిస్తున్న అఫ్గాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో అఫ్గాన్ పరాజయం చవిచూసింది. అయితే రెండు మ్యాచుల్లోనూ అఫ్గాన్ గట్టిగానే పోరాడింది. బలమైన ఆస్ట్రేలియాకు దీటుగా జవాబిచ్చింది. లంకపై […] The post హ్యాట్రిక్‌పై కివీస్ కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేడు అఫ్గాన్‌తో పోరు
టాంటాన్: వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ జట్టు శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పసికూన పరిగణిస్తున్న అఫ్గాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో అఫ్గాన్ పరాజయం చవిచూసింది. అయితే రెండు మ్యాచుల్లోనూ అఫ్గాన్ గట్టిగానే పోరాడింది. బలమైన ఆస్ట్రేలియాకు దీటుగా జవాబిచ్చింది. లంకపై కూడా బాగానే ఆడింది. ఇదే సంప్రదాయాన్ని కివీస్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే స్టార్ ఆటగాడు మహ్మద్ షెజాద్ సేవలు కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. గాయం వల్ల షెజాద్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాడు. ఈ లోటును భర్తీ చేయడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పవచ్చు. ఇక, బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్న బ్యాటింగ్ సమస్య అఫ్గాన్‌ను వెంటాడుతోంది.

టాప్ ఆర్డర్, మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. షెజాద్ ఇప్పటికే దూరం కావడం కోలుకోలేని దెబ్బగా చెప్పాలి. ఇక, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. హజ్రుతుల్లా జజాయి, రహెమత్ షా, హష్ముతుల్లా షాహిది, మహ్మద్ నబి తదితరులతో బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే నిలకడగా ఆడలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లోనైనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే కివీస్ బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. మరోవైపు నబి, ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్, జర్దాన్, గుల్బదిన్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. సమష్టిగా రాణిస్తే కివీస్‌కు గట్టి పోటీ ఇవ్వడం అఫ్గాన్‌కు కష్టమేమి కాదు. ఇదిలావుండగా ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచిన న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. మ్యాట్ హెన్రీ, బౌల్ట్, నిషమ్, సాంట్నర్, సౌథి, గ్రాండోమ్ తదితరులతో బౌలింగ్ చాలా పటిష్టంగా మారింది. అంతేగాక గుప్టిల్, మన్రో, విలియమ్సన్, రాస్ టైలర్, నిషమ్, టామ్ లాథమ్ తదితరులతో బ్యాటింగ్ కూడా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

World Cup 2019: NZ vs AFG match today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హ్యాట్రిక్‌పై కివీస్ కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: