ప్రపంచకప్‌ను వీడని వరుణుడు

బంగ్లాలంక మ్యాచ్ వర్షార్పణం భారత్‌కివీస్‌కు మ్యాచ్ పొంచి ఉన్న ప్రమాదం లండన్: ప్రపంచకప్ మ్యాచ్‌లకు వర్షం వెంటాడుతోంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం వల్ల పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. మంగళవారం బంగ్లాదేశ్‌శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇంతకుముందు పాకిస్థాన్‌శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. ఇక, సోమవారం దక్షిణాఫ్రికావెస్టిండీస్ జట్ల మధ్య […] The post ప్రపంచకప్‌ను వీడని వరుణుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బంగ్లాలంక మ్యాచ్ వర్షార్పణం
భారత్‌కివీస్‌కు మ్యాచ్ పొంచి ఉన్న ప్రమాదం
లండన్: ప్రపంచకప్ మ్యాచ్‌లకు వర్షం వెంటాడుతోంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం వల్ల పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. మంగళవారం బంగ్లాదేశ్‌శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఇంతకుముందు పాకిస్థాన్‌శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. ఇక, సోమవారం దక్షిణాఫ్రికావెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షానికి బలైంది. ఈ మ్యాచ్ కూడా రద్దుకాక తప్పలేదు. ఇదిలావుండగా గురువారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ప్రమాదం పొంచి ఉంది. గురువారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారడం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా ఇంగ్లండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వరుణుడి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. తాజాగా మరో మ్యాచ్ కూడా వర్షం బారీన పడడం ఖాయమని వాతావరణ శాఖ తెలపడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
జట్లపై ప్రభావం
ఇదిలావుండగా వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దు అవుతుండడంతో ఆయా జట్ల పరిస్థితి సంకటంగా తయారైంది. శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌లు ఇప్పటికే వర్షం వల్ల రద్దయ్యాయి. దీంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాలని భావించిన శ్రీలంకకు మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కూడా వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్ వర్షార్పణం కావడంతో పాకిస్థాన్, శ్రీలంకలకు కోలుకోలేని దెబ్బగా మారింది. మరోవైపు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడి నాకౌట్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న సౌతాఫ్రికా జట్టుకు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ రద్దు కావడం పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని సౌతాఫ్రికా భావించింది.

అయితే దక్షిణాఫ్రికా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సఫారీ జట్టు కేవలం ఒక పాయింట్ మాత్రమే సాధించింది. శ్రీలంక 4 మ్యాచుల్లో నాలుగు పాయింట్లను నమోదు చేసింది. విండీస్ కూడా ఒక మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్ల వద్దే నిలిచింది. పాకిస్థాన్‌కు కూడా వర్షం వల్ల ఒక పాయింట్‌ను కోల్పోక తప్పలేదు. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండింటిలో ఓటమి పాలైంది. ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, మరోకటి వర్షం వల్ల రద్దయ్యింది. బంగ్లాదేశ్ కూడా మూడు పాయింట్లతోనే సరిపెట్టుకోక తప్పలేదు. ఇదిలావుండగా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న భారత్‌కు కూడా వర్షం ప్రమాదం పొంచివుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి భారత్ జోరుమీదుంది. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. అయితే వర్షం భారత్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లి సేన దూకుడు మీద కనిపిస్తోంది. ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అదే జోరును కివీస్‌పై కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కానీ, వర్షం ప్రమాదం పొంచి ఉండడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. కాగా, న్యూజిలాండ్ కూడా ఇప్పటికే మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌ను కూడా ఓడించి మరింత మెరుగైన స్థితిలో నిలువాలని తహతహలాడుతోంది. ఒకవేళ వర్షం అడ్డంకిగా మారితే కివీస్‌కు కూడా సమస్యలు తప్పక పోవచ్చు.

World Cup 2019: BAN vs SRL match Called off at Bristol

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రపంచకప్‌ను వీడని వరుణుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: