క్వార్టర్స్‌లో మేరీకోమ్, జమున

ఉలన్ ఉడే: రష్యా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మేరీకోమ్, జమున బోరో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 51 కిలోల విభాగంలో మేరీకోమ్, 54 కిలోల విభాగంలో జమున క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మేరీకోమ్ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో థాయిలాండ్ బాక్సర్ జిట్‌పాంగ్ జుట్మాస్‌ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మేరీకోమ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ధాటికి జిట్‌పాంగ్ ఎదురు నిలువలేక పోయింది. కళ్లు చెదిరే పంచ్‌లతో విరుచుకు పడిన మేరీకోమ్ సునాయాస విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో మేరీకోమ్‌కు బై లభించిన విషయం తెలిసిందే. ఇక, బుధవారం జరిగిన పోటీలో జమున ఏక పక్ష విజయం సాధించింది. అల్జీరియా బాక్సర్ సోఫోతో జరిగిన పోరులో జమున 50తో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే జమును జోరును కొనసాగించింది. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి వరకు ఆధిపత్యాన్ని కనబరుస్తూ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది.

World Boxing C’ship: Mary Kom reach to Quarter Finals

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్వార్టర్స్‌లో మేరీకోమ్, జమున appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.