ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, కాపాడాలి

  సుబేదారి : ఆదివాసీ జాతి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను ఎప్పటికి మరువద్దని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవనం నందు కోయ తెగల సంఘం ఉపాధ్యక్షుడు గొంది సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జెపాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివాసీ […] The post ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, కాపాడాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుబేదారి : ఆదివాసీ జాతి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను ఎప్పటికి మరువద్దని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ భవనం నందు కోయ తెగల సంఘం ఉపాధ్యక్షుడు గొంది సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జెపాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు తగ్గుముఖం పడుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత చదువుకున్న నేటి యువతపై ఉందన్నారు. సొంత భాషను మరువద్దని, అవసరాలను బట్టి ఆంగ్లం, ఇతర భాషలను వాడాలన్నారు.

సొంత గ్రామాల్లో అందరితో కలిసిమెలిసి ఉంటూ భూములను సాగుచేయిస్తూ సేవాభావాన్ని ఇతరులతో పెంపొందించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షల శిక్షణ పొంది, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని, ఇది ఆదివాసీలకు శుభసూచకమన్నారు. చాలా మంది టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని అభినందించారు. నేటి యువత నిర్ధిష్టమైన లక్షాలను ఎంచుకొని కష్టపడి చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూశాఖ, మొదలగు శాఖలలో ఉద్యోగాలు పొంది, ఆదివాసీలు ముందంజలో ఉండాలని కోరారు. అప్పుడు సేవ చేసే భాగ్యం దక్కుతుందన్నారు.

అలాగే జర్నలిస్టు ఫీల్డ్‌లో చాలా తక్కువగా ఉన్నారని, జర్నలిస్టు ఫీల్డ్‌ను ఎంచుకొని మీ సమస్యలను ప్రసార మాధ్యమాల ద్వారా సమాజంలో చేరవేస్తే ప్రజలు ఆలోచించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎల్‌టిఆర్, పిఒటి, ఆర్‌ఒఆర్ చట్టాల ద్వారా అర్హులై ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎజెసి వీరమల్లు, కెయు రిటైర్డ్ ప్రొఫెసర్ కుడుముల చొక్కయ్య, తాడ్వాయి సమ్మక్క-సారలమ్మ ఎంపిపి గొంది వాణిశ్రీ, రిటైర్డ్ ఆర్‌డిఒ కొమురం ప్రసాద్, రిటైర్డ్ ఎమ్మార్వో పోదెం లక్ష్మయ్య, కొమురం ఆదివాసి నాయకులు ఎంకిడి బుచ్చయ్య, చేల సత్యం, కాక రవి, టిజెఎస్ చాప బాబు, కోయదొరల సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గ బాబు, ఐటిడిఎ డబ్బగట్ల జనార్దన్, ఆదివాసీ నాయకులు సోయం ఓదెలు, ఆదివాసి వివిధ సంఘాల నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

World Adivasi Day celebrations grandly in Warangal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, కాపాడాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: