డిపోల వద్ద కార్మికుల క్యూలు

  సమ్మె వదులుకున్నాం, విధుల్లోకి తీసుకోండని విజ్ఞప్తి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని చెబుతున్న మేనేజర్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు విధుల్లోకి తీసుకోం కార్మికులకు తేల్చిచెబుతున్న డిపో మేనేజర్లు ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ హైదరాబాద్ : ఇన్నాళ్ల్లు సమ్మెలో ఉన్న ఆర్‌టిసి కార్మికులు తిరిగి డిపోల బాట పట్టారు. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. 40 రోజులకు […] The post డిపోల వద్ద కార్మికుల క్యూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సమ్మె వదులుకున్నాం, విధుల్లోకి తీసుకోండని విజ్ఞప్తి
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని చెబుతున్న మేనేజర్లు

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు
విధుల్లోకి తీసుకోం
కార్మికులకు తేల్చిచెబుతున్న డిపో మేనేజర్లు
ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

హైదరాబాద్ : ఇన్నాళ్ల్లు సమ్మెలో ఉన్న ఆర్‌టిసి కార్మికులు తిరిగి డిపోల బాట పట్టారు. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణకు సిద్ధమని జేఏసీ ప్రకటించడంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోలకు పోటెత్తారు. 40 రోజులకు పైగా సమ్మె చేసి ఇబ్బందులు పడుతున్న కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు పత్రాలు సమర్పిం చేందుకు ముందుకొచ్చినా విధుల్లోకి ఎలా తీసుకోవాలో తెలియక డిపో మేనేజర్లు తికమకపడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు రాలేదని, ప్రభుత్వం నుంచి ఏదో ఒక నిర్ణయం వస్తే తాము విధుల్లోకి తీసుకుంటామని డిఎంలు కార్మికులతో పేర్కొంటున్నారు.

దీంతో రెండురోజులుగా సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్ద వేచిచూసి తిరిగి వెళ్లిపోతున్నారు. అన్నీ డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు ఆర్టీసీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు కార్మికులకు చెప్పి పంపిస్తున్నట్టుగా తెలిసింది.

కెసిఆర్ ఆదుకుంటారని కార్మికుల ఆశాభావం
తమ కష్టాలు తెలిసిన సిఎం కెసిఆర్ తమను ఆదుకుంటారని ఆర్టీసీ కార్మికులు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సిఎం కెసిఆర్ గతంలో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదని పలువురు కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమ్మెవల్ల ఆర్థికంగా నష్టపోయామని, విలువైన సమయం వృథా అయిందని కార్మికులు ఒక్కచోట చేరినప్పుడు తమ బాధలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశమిస్తే ఉద్యోగంలో చేరి తమ పని తాము చేసుకుంటామని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో కార్మికులు రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు.

హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో కార్మికులు డిపోలకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సమ్మె విరమణ ప్రతిపాదనపై చర్చించి తమ నిర్ణయం వెల్లడించాలని ఆర్టీసీ కార్మికుల జేఏసి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే, సమ్మెకు సంబంధించిన అంశం కార్మిక న్యాయస్థానంలోనే తేల్చాలని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, అది తేలిన తర్వాతే వారిని విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందో లేదో అని కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Worker’ queue at bus Depots

The post డిపోల వద్ద కార్మికుల క్యూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: