చిరునవ్వుతో ప్రారంభించండి

  ఆఫీసుల్లో భిన్నమనస్తత్వాలున్న వ్యక్తులుంటారు. వారితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి సర్దుకుపోవడం కష్టంగానూ ఉండొచ్చు.. అలాకాకుండా కొన్ని చిన్నచిన్న విషయాలు తెలుసుకుంటే తేలిగ్గా అందరితో కలిసి పనిచేసుకోవచ్చు. అప్పుడే అఫీసు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పని ఒత్తిడి తెలియదు. ఇంతకీ ఏంచేయాలంటే..  ఆఫీసులో రోజును చిరునవ్వుతో మొదలుపెట్టండి. సహచరులతో లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్తుండండి. అలా స్నేహాన్ని పెంచుకోండి. ఇందువల్ల సహచరుల వ్యక్తిత్వం తెలుస్తుంది. మీరే వారితో ఏదైనా సంభాషణను ప్రారంభించండి. అదేవిధంగా […]

 

ఆఫీసుల్లో భిన్నమనస్తత్వాలున్న వ్యక్తులుంటారు. వారితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి సర్దుకుపోవడం కష్టంగానూ ఉండొచ్చు.. అలాకాకుండా కొన్ని చిన్నచిన్న విషయాలు తెలుసుకుంటే తేలిగ్గా అందరితో కలిసి పనిచేసుకోవచ్చు. అప్పుడే అఫీసు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పని ఒత్తిడి తెలియదు. ఇంతకీ ఏంచేయాలంటే.. 

ఆఫీసులో రోజును చిరునవ్వుతో మొదలుపెట్టండి. సహచరులతో లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్తుండండి. అలా స్నేహాన్ని పెంచుకోండి. ఇందువల్ల సహచరుల వ్యక్తిత్వం తెలుస్తుంది. మీరే వారితో ఏదైనా సంభాషణను ప్రారంభించండి. అదేవిధంగా మీ వల్ల ఎదుటివారికి అసౌకర్యం కలిగినప్పుడు ‘క్షమించండి’ అని, ఏదైన మేలు జరిగినప్పుడు ‘థాంక్స్’ అని చెప్పడం మరిచిపోకండి. ఇ లా చెప్పకపోతే ఎదుటి వారి ఈగో దెబ్బతింటుంది. అలాగే మీ పనికి సంబంధించిన సహాయం మీ సహొద్యోగిని కోరినప్పుడు ‘ప్లీజ్’ అనే పదం వాడటం ఉత్తమం.

ఆఫీసులో ఉద్యోగం సక్రమంగా చేయాలంటే పురుషుల సహకారం కూడా అవసరమే. కార్యాలయాల్లో మనపై అధికారులు, సహచరులు ఎక్కువగా పురుషులే ఉంటారు. వారితోనూ స్నేహపూర్వకంగా మెలగా లి. వారితో ఏదైనా ఫెయిర్‌గా మాట్లాడండి. ఏదైన సమస్య వస్తే పరిష్కారం చూపేలా మీ భావాలు వ్యక్తం చేయండి.

ఎదుటి వారు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు వారికి సహాయపడటానికి ముందుకెళ్లండి. వారి పని సులువవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీకు ఏదైన సమస్య వచ్చినప్పుడు వారు కూడా మీ కు సహాయం చేయడానికి ముందుకొస్తా రు. ఇలాంటి సంఘటనలే వారికి మిమ్మల్ని దగ్గర చేస్తా యి. ఇ తరులకు గౌరవం ఇవ్వకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరితో మర్యాద గా మెలగండి. ఎదుటివారు పలకరిస్తే సరిగ్గా స్పం దించండి. గాసిప్స్‌కు దూరంగా ఉం డం డి. పనిలో జరిగే పొరపాట్లను ఇతరు ల పైకి నెట్టడం సరికాదు. ఇవి మీపై చెడు అభిప్రాయం కలిగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

ఎవరూ కావాలని తప్పు చేయరు. కార్యాలయంలో మీ సహచరులు ఏదైన పొరపాటు చేసినప్పుడు పై అధికారుల వద్ద వారికి మద్దతు గా నిలవండి. మీ సహోద్యోగికి కూడా ఇటువంటిది మరోసారి చేయకూడదని చెప్పండి. అభిప్రాయాలు, సిద్ధాంతాలు అందరివీ ఒకే లా ఉండవు. పెరిగిన ప్రాంతం, పరిస్థితి ఆ ధారంగా ఇవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉం టాయి. అందుకే వాటి గురించి ఎప్పు డూ వాదించొద్దు. ఇవి క్రమంగా పెరుగుతాయే తప్ప అసలు తగ్గవు. వీటి గు రించి ఎవరెనా ప్రస్తావించినా మీరు వెనక్కి తగ్గడమే మంచిది కానీ వాద న వద్దు. ఇటువంటి వాదనలు మ నుషులను వర్గాలుగా విడగొడతా యే కానీ దగ్గర చేయవు. ఈ తీరు పనివాతావరణాన్నీ ప్రభావితం చేస్తుంది.

Work with fellow employees in office

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: