ఆకట్టుకున్న షార్ట్‌ఫిల్మ్

short films

 

నెలసరి సమయంలో అమ్మాయిల మూడ్ ఎలా ఉంటుందో ఒక చిన్న షార్ట్ ఫిలిమ్ లో చూపించారు. ఇప్పటికే ఈ ఫిలిమ్ 38 లక్షల మంది చూసారు. సిద్ధు, కీర్తి ఇద్దరు భార్యాభర్తలు. సిద్ధు ముఖ్యమైన మీటింగ్ కు వెళుతుంటాడు. కీర్తి చాలా చిరగ్గా ఉంటుంది. సిద్ధు పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు. దారిలో ఫ్రెండ్ కలుస్తాడు. అంతకు ముందు రోజు అతను ఆఫీస్‌కు రాకపోకడం వల్ల ఎంతో పని ఆగిపోయిందని సిద్ధు విసుక్కుంటాడు. తన భార్య వ్యక్తిగత ఇబ్బందివల్ల రాలేకపోయాను పర్లేదు ఈ రోజు ఆ పని పూర్తిచేస్తాను అని ఫ్రెండ్ అనటంతో సిద్ధు తన పొరపాటు తెలుస్తుంది . కీర్తి కోసం వెనక్కు పరిగెత్తుకు వస్తాడు. ఆమెను ఓదారుస్తాడు. చాలా సున్నితమైన అంశాన్ని అంత కన్నా సున్నితంగా తీశాడు దర్శకుడు సతీష్ రెడ్డి. యూట్యూబ్ లో SHE & PERIODS ఈ షార్ట్ ఫిలిం ఉంది తప్పక చుడండి.

womens act in short films in a monthly period time

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆకట్టుకున్న షార్ట్‌ఫిల్మ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.