సూపర్‌నోవస్ గెలుపు

జైపూర్: మహిళల టీ20 ఛాలెంజ్ కప్‌లో సూపర్‌నోవస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సూపర్‌నోవస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా వెలాసిటీ కూడా ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవస్‌వెలాసిటీ జట్లు తలపడుతాయి. కాగా, వెలాసిటీతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. స్టార్ క్రికెటర్ జెమిమా […] The post సూపర్‌నోవస్ గెలుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జైపూర్: మహిళల టీ20 ఛాలెంజ్ కప్‌లో సూపర్‌నోవస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సూపర్‌నోవస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా వెలాసిటీ కూడా ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవస్‌వెలాసిటీ జట్లు తలపడుతాయి. కాగా, వెలాసిటీతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోడ్రిగ్స్ వరుస ఫోర్లతో హోరెత్తించింది. చెలరేగి ఆడిన రోడ్రిగ్స్ 48 బంతుల్లోనే పది ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (31) తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెలాసిటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డానియలి వ్యాట్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. ధాటిగా ఆడిన వ్యాట్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 43 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ అజేయంగా 40 పరుగులు చేసినా జట్టును గెలిపించలేక పోయింది. చివర్లలో వేదా కృష్ణమూర్తి మూడు ఫోర్లత 30 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కాగా, సూపర్‌నోవస్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వెలాసిటీకి ఓటమి తప్పలేదు.

Women T20 Challenge: Supernovas beat to Velocity

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సూపర్‌నోవస్ గెలుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: