వెలాసిటీ జయభేరి

రాణించిన బౌలర్లు, ఆదుకున్న వ్యాట్, షఫాలి, బ్లేజర్స్‌కు తప్పని ఓటమి, మహిళల టి20 జైపూర్: ఐపిఎల్ మహిళల ట్వంటీ20 ఛాలెంజ్ కప్‌లో వెలాసిటీ శుభారంభం చేసింది. బుధవారం జైపూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెలాసిటీ మూడు వికెట్ల తేడాతో ట్రయల్ బ్లేజర్స్ జట్టును ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం వెలాసిటీ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన వెలాసిటీకి ఓపెనర్లు శుభారంభం […] The post వెలాసిటీ జయభేరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాణించిన బౌలర్లు, ఆదుకున్న వ్యాట్, షఫాలి, బ్లేజర్స్‌కు తప్పని ఓటమి, మహిళల టి20
జైపూర్: ఐపిఎల్ మహిళల ట్వంటీ20 ఛాలెంజ్ కప్‌లో వెలాసిటీ శుభారంభం చేసింది. బుధవారం జైపూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెలాసిటీ మూడు వికెట్ల తేడాతో ట్రయల్ బ్లేజర్స్ జట్టును ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం వెలాసిటీ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన వెలాసిటీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ షఫాలి వర్మ ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించింది. మరో ఓపెనర్ హిలీ మాథ్యూస్ సమన్వయంతో ఆడుతూ షఫాలికి సహకారం అందించింది. హిలీ ఒక ఫోర్‌తో ఐదు పరుగులే చేసినా షఫాలికి అండగా నిలిచింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యంలో కూడా పాలుపంచుకుంది. కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన డేనియల్ వ్యాట్‌తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలి ఐదు ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను వ్యాట్ తనపై వేసుకుంది. ఆమెకు కెప్టెన్ మిథాలీ రాజ్ అండగా నిలిచింది. ఇద్దరు కలిసి బ్లేజర్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో ఆడిన మిథాలీ ఒక ఫోర్‌తో 17 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన వ్యాట 35 బంతుల్లో ఐదు బౌండరీలు, మరో రెండు సిక్సర్లతో 46 పరుగులు చేసి వెలాసిటీ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇదిలావుండగా వెలాసిటీ విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఐదు వికెట్లు పడిపోవడం మ్యాచ్‌లో ఉత్కంఠను రేపింది. అయితే ఈ రెండు పరుగులు సాధించడంలో వెలాసిటీ సఫలం అయ్యింది. దీంతో వరుసగా రెండో విజయం సాధించాలని భావించిన బ్లేజర్స్ ఆశ నెరవేరలేదు.
ఆదుకున్న హర్లీన్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన మంధాన సేన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. తొలి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 90 పరుగులు చేసిన కెప్టెన్ స్మృతి మంధాన ఈసారి ఆ జోరును కనబరచ లేక పోయింది. రెండు ఫోర్లతో పది పరుగులు మాత్రమే చేసి ఔటైంది. మరో ఓపెనర్ సుజి బేట్స్ ధాటిగా ఆడి 26 పరుగులు చేసింది. మరోవైపు హర్లీన్ డియోల్ వెలాసిటీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లింది. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ బాట పడుతున్నా హర్లీన్ మాత్రం పోరాటం కొనసాగించింది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్లీన్ 40 బంతుల్లో ఐదు ఫోర్లతో 43 పరుగులు చేసింది. మిగతావారు విఫలం కాడంతో బ్లేజర్స్ భారీ స్కోరు సాధించలేక పోయింది. వెలాసిటీ బౌలర్లలో శిఖా పాండే ఏక్తా బిస్త్, కోమల్, సుశ్రి ప్రధాన్ తదితరులు పొదుపుగా బౌలింగ్ చేశారు.

Women T20 Chalengers: Velacity team beat to Trial blesers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వెలాసిటీ జయభేరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: