కలసి పోరాడారు..జంటగా మారారు

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపిసిలోని 377 సెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయించడానికి కారకులైన మహిళా న్యాయవాదులు మేనకా గురుస్వామి, అరుంధతీ కట్జూ ఇప్పుడు జంటగా మారారు. తామిద్దరం సహజీవనం సాగిస్తున్నామంటూ వారు రెండు రోజుల క్రితం ప్రకటించారు. సిఎన్‌ఎన్‌లో ఫరీద్ జకారియా హోస్ట్‌గా ప్రసారమయ్యే జిపిఎస్ షోలో హాజరైన ఈ ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు 377 సెక్షన్‌కు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తమకు వ్యక్తిగతమైనదని కూడా అంగీకరించారు. ఈ షోకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ మహిళా న్యాయవాదుల జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన 2019లో ప్రపంచంలోని వంద మంది అత్యంత ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఈ ఇద్దరు పేర్లు ఉన్నాయి. స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమన్న 157 ఏళ్ల చట్టాన్ని రద్దు చేయడంలో తీవ్రంగా శ్రమించిన ఈ ఇద్దరు మహిళా న్యాయవాదుల కృషిని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఆ మ్యాగజైన్‌లో రాసిన ముందుమాటలో ప్రశంసించారు.

 

Women Lawyers open up as a couple, Menaka Guruswamy, Arundhati Katju were named in TIME magazines list of the 100 most influential people in the world for 2019

The post కలసి పోరాడారు..జంటగా మారారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.